దర్శకుడి చెల్లిపై ఆ నటుడు లైంగిక వేధింపులు.. విషయం తెలిసి డైరెక్టర్ ఏం చేశాడంటే..

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరిగా పేరు సంపాదించుకున్నాడు. నాగార్జున హీరోగా నటించిన ‘శివ’ సినిమాతో టాలీవుడ్ ఇన్ లోకి దర్శకుడుగా అడుగుపెట్టాడు. తన మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత రామ్ గోపాల్ వర్మ తెలుగులో చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు కానీ ఏ సినిమా కూడా ఆశించిన ఫలితాని ఇవ్వలేకపోయింది. ఆ తరువాత బాలీవుడ్ వైపు అడుగులు వేసిన రామ్ గోపాల్ వర్మ ‘సత్య, కంపెనీ, సర్కార్, రంగీలా ‘ లాంటి బ్లాక్బస్టర్ సినిమా లు తీసి పాన్ ఇండియా డైరెక్టర్ గా ఏదిగాడు.

అలాంటి స్టార్ డైరెక్టర్ ఇప్పుడు మతి చెడిపోయినట్లు బూతు సినిమా లు చేస్తూ తన స్థాయి ని అతనే తగ్గించుకొని పాతాళానికి పడిపోతున్నాడు. ఈ విషయం పక్కన పెడితే రామ్ గోపాల్ వర్మ బంధాలకు బంధుత్వాలకు పెద్దగా విలువ ఇచ్చే వ్యక్తి కాదు. అలాంటిది తన చెల్లి అయిన విజయ లక్ష్మి విషయం లో మాత్రం అందరూ శభాష్ అనే రేంజ్ లో ప్రవర్తించాడు. రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూ లో విజయ లక్ష్మి నే స్వయంగా ఆ విషయం గురించి చెప్పుకొచ్చింది. అసలు విషయంలోకి వెళ్తే ఇండస్ట్రీ కి చెందిన ఇద్దరు వ్యక్తులు విజయలక్ష్మి పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించారట. ప్రతిరోజు ఆమె ఇంటి చుట్టూ తిరుగుతూ, ఆమె కనపడినప్పుడల్లా అసభ్యంగా మాట్లాడుతూ, శరీర భాగలను వర్ణిస్తూ చాలా నీచంగా ప్రవర్తించ్చేవరట.

అయితే చాలా రోజులు వాళ్ళ వేధింపులను భరించిన విజయలక్ష్మి ఒక రోజు తన అన్న రామ్ గోపాల్ వర్మ కి విషయం చెప్పిందట. చెల్లెలి తో అలా అసభ్యం గా ప్రవర్తిస్తున్నారు అనే విషయం తెలియగానే రామ్ గోపాల్ వర్మ పట్టరాని కోపం తో ఆ ఇద్దరు ఉంటున్న కాలనీ లోకి వెళ్లి వాళ్ళని ఇడ్చుకుంటూ బయటకి తీసుకొచ్చి, ఇంటిదగ్గర ఉన్న మర్రి చెట్టుకి వాళ్లిద్దరిని కట్టేసి కుక్కల్ని కొట్టినట్లు కొట్టడట. నా చెల్లి తో అసభ్యంగా ప్రవర్తిస్తారా అంటూ రామ్ గోపాల్ వర్మ చూపించిన కోపం చూసి అక్కడ ఉన్న వాళ్లంతా ఆ ఇద్దరిని చంపేస్తాడేమో అని బయపడ్డారట. రామ్ గోపాల్ వర్మ గురించి విజయలక్ష్మి చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.