బాల‌య్య వేసుకున్న ఈ ల‌య‌న్ బ్యాగ్ కాస్ట్ ఎంతో తెలుసా.. నందమూరి రేంజ్ అంటే అదే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నరసిం హం బాలయ్యకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అందరి హీరోలు క్లాస్ గా మెప్పిస్తే బాలయ్య మాస్ లుక్స్ లో కూడా మెప్పిస్తాడు . బాలయ్య మాస్ లుక్స్ లో కనిపిస్తే అభిమానులు వచ్చే పూనకాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ప్రెసెంట్ బాలయ్య రాజకీయాలలో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు.

తన బావ నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ అయినప్పటి నుంచి రాజకీయాలలో మహాయాక్టివ్ గా పాల్గొంటున్నాడు బాలయ్య . ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా బాలయ్య హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లాడు. గన్నవరం ఎయిర్ పోర్ట్ లో దిగాక బ్యాక్ ఓ బ్యాగ్ వేసుకొని దర్శనమిచ్చాడు . ఈ బ్యాగ్ చాలా అట్రాక్టివ్ గా ఉండడంతో జనాలు ఈ బ్యాగ్ కి ఉన్న స్పెషాలిటీ గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .

అంతేకాదు చూడడానికి చాలా స్టైలిష్ గా ఉంది. ఈ బ్యాగ్ ధర ఎంత ఉంటుందా అంటూ గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు . అయితే ఈ బ్యాగ్ ధర కేవలం 25000 అంటూ తెలుస్తుంది . 37% డిస్కౌంట్ లో 15,000కే బాలయ్యకు వచ్చిందట . అంతేకాదు ఈ బ్యాగ్ చూస్తే ఎవరైనా ఒక ఐదు , ఆరు లక్షలు పైనే ఉంటుంది అనుకుంటారు . అంత స్టైలిష్ గా ఉంది . మన బాలయ్య వేసుకున్నాక మరింత స్టైలిష్ గా మారిపోయింది అంటున్నారు నందమూరి అభిమానులు..!