ఈ మధ్యకాలంలో సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి స్టార్ హీరో హీరోయిన్లు ..ఎంత తాపత్రయ పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ హీరో స్టేజి పై షర్ట్ తీస్తే మరో హీరో స్టేజ్ పై హీరోయిన్ కొంగు చుట్టుకుంటాడు .. మరో హీరో ఏకంగా ప్రమోషన్స్ కి షార్ట్స్ వేసుకొని వస్తారు .. ఇలా ఇండస్ట్రీలో ఉండే హీరోస్ ఒకరి ని మించి ఒకరు సినిమాలను ప్రమోట్ చేసుకుంటూ ఉంటే.. బాలీవుడ్ లో సినిమా షూటింగ్ దశలో ఉండగానే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేస్తున్నారు.
రీసెంట్గా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కీర్తి సురేష్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే . అట్లీ దర్శకత్వంలో తెరకేకపోతున్న సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించబోతుంది . ఈ సినిమాలో హీరోగా బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో వరుణ్ దావన్ నటిస్తున్నాడు. వరుణ్ ధావన్ కు ఇది 18వ సినిమా కాగా కీర్తి సురేష్ కి ఇదే మొదటి సినిమా. ఈ క్రమంలోనే సినిమాను ఎలాగైనా హిట్ చేయించాలి అన్న కసితో ఇప్పటినుంచి ప్రమోషన్ స్టార్ట్ చేసేసారు మూవీ టీం.
ఈ క్రమంలోనే వాళ్ళిద్దరూ ఆటోలో రైడ్ కి వెళ్తున్న వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు . ఈ వీడియోలో కీర్తి సురేష్ సిగ్గుపడుతూ ఉంటే వరుణ్ ధావన్ ఏకంగా షర్ట్ లేకుండా ఉండడం మనం గమనించవచ్చు. దీంతో ఈ వీడియో సెకండ్స్ లోనే నెట్టింట వైరల్ గా మారిపోయింది..!!
View this post on Instagram