బాలయ్య ” భగవంత్‌ కేసరి ” మూవీ రన్ టైం లాక్.. ఎన్ని నిమిషాలు అంటే..?

నందమూరి నట‌సింహ బాలకృష్ణ హీరోగా.. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా యంగ్‌ హీరోయిన్ శ్రీ లీల కీలక పాత్రలో నటిస్తున్న మూవీ భగవంత్ కేసరి. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామాగా భగవంత్ కేసరి రూపొందుతుంది. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాతో ఎలాగైనా హ్య‌ట్రిక్ హిట్ కొడ‌తాడ‌ని బాలయ్య ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. మరి ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమాపై హైప్‌ని ఓ రేంజ్‌లో సెట్ చేసుకున్నాడు బాలయ్య. ఈ సినిమా కోసం అంతా ఏక్సైటెడ్గా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాపై లేటెస్ట్గా మరో అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

భగవంత్ కేసరి సినిమా రన్ టైం 2 గం.. 37 ని.. మేర ఫిక్స్ అయింది అంటూ రూమర్స్ వైరల్ అవుతున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి ఎస్ .థ‌మ‌న్‌ సంగీతం అందిస్తుండగా.. స‌న్‌ స్క్రీన్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతుంది. ఈ ఏడాది ద‌స‌ర‌కు మూవీ గ్రాండ్ గా ప్రేక్షకులు ముందుకు రానుంది.