ముఖేష్ అంబానీ కొత్త కారు ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరైన.. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ” ముఖేష్ అంబానీ ” గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అత్యంత విశాలమైన జీవితం గడిపే వీరి కుటుంబం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా ఇప్పుడు కొత్త జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

భారతదేశంలోని ముఖ్యమైన వ్యక్తులలో ఒకరైన ముఖేష్ అంబానీ కి ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది. ఇందులో భాగంగానే వారి సెక్యూరిటీ కూడా అత్యంత ఖరీదైన సేఫెస్ట్ కారులను వినియోగిస్తారు. అయితే ముఖేష్ అంబానీ మాత్రం మరింత కొట్టుదిట్టమైన భద్రత కలిగిన బుల్లెట్ ప్రూఫ్ కారు వినియోగిస్తారు. దీనికి సంబంధించిన వీడియోలు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. కాగా ఇటీవల ఓ కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించారు. ఇది వారి గ్యారేజిలో చేరిన 7వ బుల్లెట్ ప్రూఫ్ మెర్సిడెస్ ఫ్లాగ్షిప్ సెడాన్. ముకేశ్ అంబానీ 7వ మెర్సిడెస్ బెంజ్ ఎస్680 గార్డ్ చిత్రాలను కార్ క్రేజీ ఇండియా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో షేర్ చేశారు.

ఇందులో కొత్త కారుని చూడవచ్చు. ఈ కార్డు తో పాటు రేంజ్ రోవర్ వోగ్ సెక్యూరిటీ కారు కూడా ఇక్కడ కనిపిస్తుంది. బెంజ్ కార్ కి 999 అనే ప్లేట్ కలిగి ఉండటం కూడా ఇక్కడ గమనించవచ్చు. ముకేశ్ అంబానీ గ్యారేజీలో చేరిన ఈ కారు ధర రూ. 10 కోట్లు వరకు ఉంటుందని సమాచారం. ఇది చాలా సురక్షితమైన కారుగా తీర్చిదిద్దారు.ఈ బెంజ్ కారు ట్విన్, టర్బోచార్జ్డ్ 6.0 లీటర్ v12 ఇంజన్ ద్వారా 523 BhP పవర్ అండ్ 850 NM టార్క్ ప్రొడ్యూస్ చేస్తూ పనితీరుని అందిస్తుంది.