మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి పీటలేకబోతున్నాడు . రీసెంట్ గానే లావణ్య త్రిపాఠితో నిశ్చితార్ధం చేసుకున్న వరుణ్ త్వరలోనే లావణ్యని పెళ్లి చేసుకోబోతున్నాడు. నవంబర్ ఒకటవ తేదీ వీళ్ల పెళ్ళి జరగబోతున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు వీళ్ళ పెళ్లికి సంబంధించిన షాపింగ్ కూడా మొదలైపోయింది . ఇద్దరు పెళ్లికి షాపింగ్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
కాగా ఈ వీడియోలో కేవలం లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ లో ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జనరల్‌గా పెళ్లి పనులు అంటే కుటుంబ సభ్యులతో అందరూ కలిసి ఆహ్లాదకరంగా చేస్తూ ఉంటారు . ఉపాసన పెళ్లి టైం లోను మెగా ఫ్యామిలీ కామినేని ఫ్యామిలీ కలిసి షాపింగ్ చేశారు. అయితే వరుణ్ తేజ్ – లావణ్య మాత్రం ఇలా ఒంటరిగా షాపింగ్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.
“అయితే పెళ్లి అనేది లైఫ్ లో ఒకసారి చేసుకుంటామని.. దానికి తగ్గ బట్టలు మీ ఛాయిస్ ప్రకారం మీ ఇష్టప్రకారం చూస్ చేసుకుంటే బాగుంటుంది” అని నాగబాబు ఆయన భార్య పద్మ వరుణ్ లావణ్యలకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసారట. అందుకే వాళ్ళు రాలేదు అంటూ కూడా తెలుస్తుంది.దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది.