గద్దలతో ఆట.. గన్ తో వేట.. మహేష్ ఫ్యామిలీ వీడియో పోస్ట్ చేసిన సితారా..

వీలు దొరికితే చాలు ఫారిన్ ట్రిప్లను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మహేష్ బాబు ఫ్యామిలీ. నెల క్రితం కూడా వెకేషన్ కోసం యూరోప్‌ వెళ్ళింది. లండన్ లో కొన్ని రోజులు గడిపిన ఈ కుటుంబం తర్వాత స్కాట్లాండ్ వెళ్లి ఫ్యామిలీతో ఎంజాయ్ చేశారు. మహేష్, నమ్రత ఎప్పటికప్పుడు తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే తాజాగా మహేష్ కూతురు తమ టూర్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా అకౌంట్లో అప్లోడ్ చేసింది.

మహేష్ బాబు ఆగస్టు 9న పుట్టినరోజు వేడుకలు ఫ్యామిలీతో కలిసి గ్రాండ్గా జరుపుకున్నాడు. అక్కడ వారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఎంతగానో ఎంజాయ్ చేశారు. సితార, గౌతమ్ లు ఎలా సరదాగా గడుపుతున్నారో అనేది నమ్రత ఎప్పటికప్పుడు ఫొటోస్ రూపంలో షేర్ చేసింది. మహేష్ ఫ్యామిలీ స్కాట్లాండ్‌లో అతి పురాతనమైన రాయల్స్ స్కాట్స్‌ అండ్ ది రాయల్ రెజిమెంట్ మ్యూజియాన్ని సందర్శించి అక్కడ సరదాగా టైం స్పెండ్ చేశారు. సితార, మహేష్, గౌతమ్, న‌మ్రతలు కలిసి సెల్ఫీలు దిగిన ఫోటోలను వాళ్ళు పోస్ట్ చేశారు.

అయితే తాజాగా సితార రిలీజ్ చేసిన వీడియోలో స్కాట్లాండ్లోని అడ్వెంచర్స్ లో మహేష్ బాబు, గౌతమ్, నమ్రత, సితార ఎంజాయ్ చేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. మహేష్, గౌతమ్, సీతారా గ‌న్ షూటింగ్ చేశారు. సితార గోల్ఫ్ అడుతున్న దృశ్యం వీడియోలో ఉంది. ఇక చివరకు గ్రద్దలతో సితార, నమ్రత ఆటలాడారు. గద్దలను పిలవడం వాటికి ఆహారం పెట్టడం వంటి దృశ్యాలు ఈ షార్ట్ వీడియోలో మనం చూడవచ్చు. ప్రస్తుతం ఈ షార్ట్ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

 

 

View this post on Instagram

 

A post shared by sitara 🪩 (@sitaraghattamaneni)