కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడు అంటూ వెయిట్ చేసిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ స్టార్ట్ అయిపోయింది . తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అతి పెద్ద రియాలిటీ షో గా స్టార్ట్ అయిన బిగ్ బాస్ ఇప్పటికే ఆరు సీజన్లు కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఏడవ సీజన్ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లడానికి రెడీ అయిపోయింది . కొద్ది రోజుల క్రితమే ఈ షోను గ్రాండ్ గా స్టార్ట్ చేశారు మేకర్స్ . కాగా ఎప్పటిలాగే ఈ సీజన్ కి బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున సెలెక్ట్ అయ్యారు. ఆయన హోస్టింగ్ విధానం అభిమానులకు నచ్చకపోయినా సరే బిగ్ బాస్ మేకర్స్ ఆయనే హోస్ట్ గా నియమించారు .
దానికి కారణాలు చాలానే ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . కాగా ఈ విషయం పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్ లో ఈసారి కూడా డమ్మీ కంటెస్టెంట్లను ఎక్కువగా తీసుకొచ్చారు అన్న వాదన ఎక్కువగా వినిపిస్తుంది . మరీ ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అందరి కంటెస్టెంట్ లలో కల్లా నటుడు శివాజీ మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడని.. అతి ఎక్కువగా చేస్తున్నాడని ..ఆయన పర్ఫామెన్స్ కి ఆస్కార్ ఇచ్చిన తక్కువగానే ఉంటుందంటూ వెట కారంగా కామెంట్స్ చేస్తున్నారు జనాలు.
అంతేకాదు ప్రతి చిన్న దానికి రాద్ధాంతం చేయడం.. ఆ తర్వాత కూల్ అయిపోవడం.. శివాజీకి అలవాటుగా ఉందని .. గతంలో చాలామంది బిగ్ బాస్ లోకి వచ్చిన కంటెస్టెంట్ లు ఇలా అతి చేసి మొదటి రెండు వారాల్లోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన విషయాని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు . దీంతో శివాజీ పేరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు జనాలు..!!