తారక్ చేత అలాంటి ప్రామిస్ చేయించుకున్న అమ్మ షాలిని.. అందుకే ఆ పని ఎప్పటికి చేయడా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ అందం విషయంలోనూ నటన విషయంలోనూ తాతకు తగ్గ మనవడుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు . కాగా రీసెంట్ గానే ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ఏకంగా ఆస్కార్ అవార్డు వరించింది . ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కి సంబంధించిన ప్రతి చిన్న న్యూస్ గ్లోబల్ స్థాయిలో ట్రెండ్ అవుతుంది .

రీసెంట్ గా గ్లోబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న తారక్ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే తారక్ చిన్నప్పటి నుంచి అమ్మ చెప్పిన మాట తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటాడు. నాన్న అంటే ప్రాణం .. తల్లిదండ్రులకు ఎక్కువ గౌరవిస్తూ ఉంటాడు .. ఈ కాలం హీరోస్ లో తల్లిదండ్రులకి అంత రెస్పెక్ట్ ఇచ్చే హీరో ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు . కాగా తారక్ చేత వాళ్ళ అమ్మ షాలిని గారు చదువుకునే టైంలోనే ఒక ప్రామిస్ చేయించుకున్నారట .

“మన వల్ల నందమూరి ఫ్యామిలీకి ఎటువంటి తప్పుడు పేరు రాకూడదు ..మహిళలను గౌరవించాలి.. మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడకూడదు.. అలాంటి కామెంట్స్ చేయకూడదు ..ప్రేమ – దోమ అంటూ మన వల్ల నందమూరి ఫ్యామిలీ కి చెడ్డ పేరు రాకూడదు.. అలా నువ్వు ఎప్పటికీ చేయనని నాకు ప్రామిస్ చెయ్” అంటూ తారక్ చేత ప్రామిస్ చేయించుకుందట . అమ్మకు ఇచ్చిన మాట ప్రకారం ఎప్పుడూ కూడా తన వల్ల మహిళలు ఇబ్బంది పడేలా బాధపడేలా ప్రవర్తించలేదు తారక్. అంతేకాదు కుటుంబ సభ్యులు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు . దీంతో ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది..!!