ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే టాలీవుడ్ రౌడీ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ కి సంబంధించిన లేటెస్ట్ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. కాగా ఆయన రీసెంట్గా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా ఖుషి. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరికొద్ది గంటల్లోనే థియేటర్స్ లో ఫస్ట్ షో పడబోతుంది. కాగా ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ ని నమోదు చేసుకోబోతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు .ఇలాంటి క్రమంలోని విజయ్ దేవరకొండ ఖుషి సినిమా ప్రమోషన్స్ లో విజయ్ చేసిన కామెంట్స్ సమంత – విజయ్ దేవరకొండ మధ్య ఏదో ఉంది అనే విధంగా ఉన్నాయి అంటూ ట్రోల్ చేస్తున్నారు అభిమానులు .
రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ ఖుషి కి సంబంధించిన విషయాలతో పాటు సమంతకి సంబంధించిన విషయాలను సైతం షేర్ చేసుకున్నారు . అంతేకాదు ఎప్పటినుంచో తనలో ఉన్న బ్యాడ్ క్వాలిటీని సమంత మార్చేసింది అంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఈ సినిమా షూటింగ్ టైంలో కొన్ని సీన్ ఆయనకు నచ్చలేదట.. ఇదే క్రమంలో శివ పై డైరెక్ట్‌గా ఓపెన్ గా అరిచేసాడట. అయితే ఆయన మాటలకు శివ నొచ్చుకున్నాడట. ఆ విషయం ఆలస్యంగా ఆయనకు తెలిసింది అని చెప్పుకొచ్చాడు . అప్పుడే విజయ్ దేవరకొండకు సమంత పెద్ద క్లాసే పీకిందట . మనకు ఏదైనా ఇష్టం లేనప్పుడు పక్కవాళ్ళకి అది చెప్పే తీరు ఉంటుంది ..పద్ధతి ఉంటుంది.. సాఫ్ట్ గా ..కూల్ గా కూడా మనకు నచ్చలేదని చెప్పచ్చు విజయ్ అంటూ తనలోని రూడ్ యాంగిల్ ని కూడా సమంత సాఫ్ట్ గా మార్చేసిందట .
అంతేకాదు సమంత గురించిచెప్పుతూ.. సమంత టెస్ట్ నా టెస్ట్ ఒకేలా ఉంటుందని .. సమంతకి ఏది ఇష్టమో నాకు అదే ఇష్టమని.. ఆమె చాలా తెలివైన అమ్మాయి అని.. సినిమాలో కొన్ని సీన్స్ తెరకెక్కించేటప్పుడు మాకు బాగా హెల్ప్ చేసిందని . అంతేకాదు నాకు మొదటి నుంచి హిస్టరీ అంటే ఇష్టం ..సమంతకి కూడా హిస్టరీ అంటే చాలా ఇష్టం. సమంత దేవుని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటుంది ..నాకు మతపరమైనవి తెలుసుకోవాలని ఇంట్రెస్టింగ్ ఎక్కువ.. అందుకే నేను డౌట్స్ అన్ని సమంత దగ్గరే క్లారిఫై చేసుకుంటూ ఉంటాను .. సమంతతో కలిసి వర్క్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది” అంటూ సమంత ను ఓ రేంజ్ లో పొగిడేసారు. ఇప్పటివరకు విజయ్ దేవరకొండ చాలామంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు . కానీ సమంతను పొగిడినట్టు మరి ఏ హీరోయిన్ ని కూడా పొగడలేదు . దీంతో వీళ్లిద్దరి మధ్య ఏదో కిచ్ కిచ్ సంబంధం ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది..!!