టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా పుష్ప1 . సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా అల్లు అర్జున్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధించింది . 69వ నేషనల్ అవార్డ్స్ లో ఉత్తమ అవార్డు వరించింది .
ఇక అవార్డ్ వచ్చినప్పుడు బన్ని సుకుమార్ కళ్ళల్లో కన్నీళ్లు కూడా వచ్చిన వీడియో మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. బన్ని తన భార్యను గట్టిగా హత్తుకొని ఎమోషనల్ అయిపోయాడు . అంతలా ఆయన ఈ అవార్డును ఎంజాయ్ చేస్తున్నాడు. కాగా ఇదే క్రమంలో సోషల్ మీడియాలో బన్నికి చాలా మంది ప్రముఖులు పక్క భాష ఇండస్ట్రీ నటులు విషెస్ అందిస్తున్నారు .
అయితే ఓ హీరో మాత్రం బన్నీకి అస్సలు విష్ చేయలేదు . పుష్పతో పాటు అవార్డ్స్ అందుకున్న ఉప్పెన సినిమాకు ఆర్ఆర్ఆర్ సినిమాకు విష్ చేసిన ఆయన బన్నీని మాత్రం అస్సలు కేర్ చేయలేదు . దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . అయితే బన్నీకు ఆయనకు మధ్య ఉన్న విభేదాలు కారణంగానే ఆయన ఇలా బన్నీ పేరును మెన్షన్ చేసి ఉండకపోవచ్చు అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!!