వాట్సాప్ కొత్త ఫీచ‌ర్‌… పేరు లేకుండానే గ్రూప్ క్రియేట్ చేయొచ్చు…!

వాట్సాప్ అనేది ప్రతి ఒక్కరి ఫోన్‌లోనూ ఉంటుంది. వాట్సాప్ లేని వాళ్ళని నేరస్తుల చూస్తున్నారు. మన దేశంలో.. ఇదివరకు కాలంలో ఉత్తరాలు రాసేవారు. కానీ ఈ కాలంలో మాత్రం వాట్సాప్‌లో చాటింగ్ చేస్తున్నారు. చాలామందికి వాట్స్అప్ అన్నా, వాట్స్అప్ స్టేటస్ అన్నా చాలా ఇష్టం. ఇక వాట్సాప్ లో ఏదైనా కొత్త ఫ్యూచర్ వచ్చిందంటే చాలు దాని వైర‌ల్ చేస్తూ ఉంటారు.

ఇప్పుడు అదే జరిగింది. వాట్సాప్ లో ఒక కొత్త ఫ్యూచర్ వచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. మెసేజింగ్ దిగ్గజ యాప్ వాట్సాప్ లో మరో కొత్త ఫ్యూచర్‌ను తీసుకొచ్చింది. ఇక మీదట గ్రూప్ క్రియేట్ చేయడానికి ఎలాంటి పేరు అవసరం లేకుండా కాంటాక్ట్లను యాడ్ చేసుకుని గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఏదైనా గ్రూప్ ను క్రియేట్ చేయాలంటే తప్పనిసరిగా పేరు పెట్టాల్సి ఉండేది. కానీ ఇక మీదట డైరెక్ట్ గా ఎలాంటి పేరు లేకుండానే గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు.

అత్యధిక ఆరు మంది వరకు ఉండే గ్రూపులకు ఎలాంటి పేరు అవసరం లేదు. గ్రూప్ మెంబర్స్‌ ఆధారంగా డైనమిక్‌గా పేరు ఉంటుంది. గ్రూప్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ల ఆధారంగా వేరువేరుగా పేరు కనిపిస్తుంది. అవసరం అనుకుంటే తర్వాత గ్రూప్ పేరు పెట్టుకోవచ్చు. పేరును మార్చుకునే ఆప్షన్ ఆడ్మిన్‌తో పాటు మెంబర్స్‌కి కూడా ఉంటుంది. త్వరలో ఈ ఫీచ‌ర్‌ను ఐఓఎస్ ,ఆండ్రాయిడ్ యూజర్లకు విడుదల చేయనున్నారు.