సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు ..కొన్ని కొన్ని రోల్స్ మనకోసమే రాసిపెట్టినట్లు ఉంటాయి. అందుకే ఆ రోల్ కోసం వేరే హీరోలను అప్రోచ్ అయినా.. వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఆ కథ మన దగ్గరికి వచ్చి హిట్టు కొట్టడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలా ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది స్టార్ సెలబ్రిటీస్ హిట్ సినిమాలను తమ ఖాతాలో వేసుకున్నారు . అయితే ఓ హీరో కోసం రాసుకున్న కథను ఆ హీరో రిజెక్ట్ చేయడంతో మహేష్ బాబుకి ఆ కథ నచ్చి హిట్ కొట్టిన సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .
ఆ సినిమా మరేదో కాదు “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు “..శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ సినిమాలో దిల్ రాజు భారీ బడ్జెట్లో నిర్మించారు . ఈ సినిమాలో హీరోయిన్లుగా అంజలి – సమంత కనిపించారు. చిన్నోడి క్యారెక్టర్ లో మహేష్ బాబు పెద్దోడి క్యారెక్టర్ లో వెంకటేష్ ప్రాణం పోసి నటించారు .
ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అదే . అయితే ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర కోసం ముందుగా మేకర్స్ పవన్ కళ్యాణ్ ని అప్రోచ్ అయ్యారట . అయితే అప్పటికే అత్తారింటికి దారేది సినిమా షూట్ లో బిజీగా ఉన్న పవన్ ఈ సినిమాను సున్నితంగా రిజెక్ట్ చేశారట . ఆ తర్వాత ఈ పాత్ర మహేష్ బాబు వద్దకు చేరడం ఆయనకు నచ్చడం…. స్పాట్లోనే అగ్రిమెంట్ పై సైన్స్ చేయడం ..తెరకెక్కించడం.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకోవడం అన్ని ఫాస్ట్ గా జరిగిపోయాయి..!!