ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో పాపులారిటీ అవ్వాలి అంటే కచ్చితంగా ఏదో ఒక కాంట్రవర్షల్ కంటెంట్ పై మాట్లాడితే చాలు సెకండ్స్ లోని వైరల్ గా అయిపోతున్నారు జనాలు . అయితే పాపులారిటీ ఉన్నవాళ్లు కూడా ఆ ఇష్యూపై మాట్లాడితే ఖచ్చితంగా దానిపై అంతో ఇంతో నిజం ఉండాలి . లేదా వాళ్లపై కోపం ఉండాలి. ఎస్ ప్రసెంట్ ఇవే కామెంట్స్ తో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది బాలీవుడ్ హాట్ బ్యూటీ కాజోల్.
రీసెంట్గా బ్యాక్ టూ బ్యాక్ రెండు వెబ్ సిరీస్ లో నటించి సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న కాజోల్.. తాజాగా తన ట్రయల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన పథాన్ సినిమా కలెక్షన్స్ మొత్తం ఫేక్ అంటూ వ్యంగంగా కౌంటర్ వేసింది కాజోల్ . దీంతో ఈ ఇష్యూ బాలీవుడ్ లో వైరల్ గా మారిపోయింది.
షారుక్ ఖాన్ గురించి మాట్లాడుతూ ..” పథాన్ సినిమా నిజంగా అంత కలెక్ట్ చేసిందా..?” అంటూ వ్యంగ్యంగా కౌంటర్ వేసింది. దీనికి సంబంధించిన వీడియో బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ కెఆర్కె ట్విట్ చేశాడు. దీంతో బాలీవుడ్ బ్యూటీ నే బాలీవుడ్ హీరోని వ్యంగ్యంగా ఎలా మాట్లాడగలదు అంటూ ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు అభిమానులు . అంతేకాదు కొందరు కావాలని నిజమే పఠాన్ సినిమా లో ఏముందని..అన్ని కోట్లు వస్తాయి..అవి అంతా ఫేక్ నమ్మనే నమ్మదు అంటూ చెప్పుకొస్తున్నారు..!!