విశ్వక్‌సేన్ సింగిల్ ఎపిసోడ్‌కి ఏకంగా అంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడా…

ఈ నగరానికి ఏమైంది, హిట్, ఫలక్‌నామా దాస్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో విశ్వక్‌సేన్. బూ సినిమాతో తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టి ఆ ప్రేక్షకులను సైతం తనదైన నటనతో అలరించాడు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం డైరెక్టర్ కృష్ణ చైతన్యతో కలిసి పీరియాడికల్ మూవీ చేస్తున్నాడు. అంతేకాకుండా, విద్యాధర్ కాగితా దర్శకత్వంలో అడ్వెంచర్ మూవీ గామిలో హీరోగా యాక్ట్ చేస్తున్నాడు. ఇందులో చాందినీ చౌదరి, మహ్మద్ సమద్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ రెండు సినిమాలపై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ టాలెంటెడ్ హీరో ఈ రెండు సినిమాలు మినహాయించి ఒక ఓటీటీ షో చేయడానికి కూడా రెడీ అయ్యాడట. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ఆహా విశ్వక్‌సేన్‌తో ఒక షో ప్లాన్ చేసిందని తెలుస్తోంది. ఫిక్షనల్ కాన్సెప్ట్ తో 15 ఎపిసోడ్స్‌తో ఈ షో ప్లాన్ చేస్తున్నారట. ఈ షో సూపర్ హిట్ అవుతుందనే ధీమాతో ఆహా ఓనర్స్ ఉన్నారని టాక్. అందుకే విశ్వక్ సేన్ అడిగినంత డబ్బులు ఇచ్చేందుకు కూడా ఒప్పుకున్నారట.

ఈ షో కోసం మొత్తం ఒక ప్యాకేజీలా రెమ్యునరేషన్ ఇవ్వాలని విశ్వక్ సేన్ అడిగాడని… అతను అడిగినట్లే ఆహా యాజమాన్యం ఒక్కో ఎపిసోడ్ కి 10 నుంచి 15 లక్షల చొప్పున మొత్తంగా 2 కోట్ల వరకు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని సమాచారం. ఇలా చూసుకుంటే ఈ యంగ్ హీరో సినిమాలతో పాటు భారీగానే డబ్బులు వెనకేసుకుంటున్నాడని చెప్పవచ్చు.

ఒకవేళ అతని నెక్స్ట్ సినిమాలు సూపర్ హిట్ అయితే పారితోషికం అతడు మరింత పెంచే అవకాశం ఉంటుంది. లేనిచో అతనికి సినిమా కెరీర్‌లో ఇబ్బందులు తప్పవు.