నటసింహం నందమూరి బాలకృష్ణ గొప్ప నటుడే కాదు గొప్ప మనసు ఉన్న వ్యక్తి కూడా. ఈ విషయం ఎన్నో సార్లు రుజువు అయింది. అయితే బాలయ్య కాస్త కోపిష్టి. కోపం వచ్చిందంటే ఎదుట ఎవరున్నా, ఎంత మంది ఉన్నా అక్కడిక్కడే చూపించేస్తారు. తాజాగా యాంకర్ సుమపై అందరూ చూస్తుండగానే లొడ లొడా వాగేస్తున్నావ్ అంటూ ఫైర్ అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
జగపతి బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం `రుద్రంగి`. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ మూవీలో విమలారామన్, మమతా మోహన్‌దాస్ కీలక పాత్రలను పోషిస్తోన్నారు. అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం హైదరాబాద్‌లో నిర్వహించగా.. తెలంగాణ మంత్రి హరీష్‌రావు, బాలకృష్ణ స్పెషల్ గెస్ట్ లుగా హాజరు అయ్యారు.
అయితే ఈ ఈవెంట్ లో యాంకర్ సుమ అతిథుల్ని స్టేజ్ పైకి ఆహ్వానిస్తూ ఒక్కొక్కరి గురించి చకచకా చెబుతూ ఉంది. ఇంతలో జగపతి బాబు స్పీచ్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. కానీ సుమ జగపతి బాబుకి మైక్ ఇవ్వకుండా ఆయన్ని పొగిడే కార్యక్రమం పెట్టుకుంది. ఇది గమనించిన బాలయ్య కాస్త అసహనానికి గురయ్యారు. వెంటనే `ఎహే ఆపు.. ఒకటే లొడలొడా వాగేస్తున్నావ్` అంటూ సరదాగా కసిరారు. దీనితో సుమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాదు ఈ కార్యక్రమంలో సుమను అనేక సార్లు బాలయ్య ఓ ఆట ఆడుకున్నారు. సుమపై అనేక జోకులు పేల్చారు.