Puspa-2 సినిమా కోసం అలాంటి సాహసం చేస్తున్న అల్లు అర్జున్..!!

టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు.అందుకు కారణం పుష్ప సినిమానే అని చెప్పవచ్చు.. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా బన్నీ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ముఖ్యంగా అల్లు అర్జున్ యాటిట్యూడ్ డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ అదరగొట్టేసారని చెప్పవచ్చు. అల్లు అర్జున్ సరసన రష్మిక నటించింది. కీలకమైన పాత్రలలో సునీల్ అనసూయ , ఫాహద్ ఫాజిల్ తదితరులు సైతం నటించారు.

Pushpa 2 The Rule first look: Allu Arjun is back as Pushpa to rule -  Hindustan Times

ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే..మొదటి భాగం విడుదలై పెను సంచలనాలను సృష్టించింది. ఇప్పుడు రెండవ భాగానికి సంబంధించి షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుగుతున్న సమయంలోనే ఈ చిత్రానికి సంబంధించి ఒక విషయం వైరల్ గా మారుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ట్విస్టులు భారీగా ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే పవర్ ఫుల్ కథను సుకుమార్ సమకూర్చినట్లు తెలుస్తోంది.

Srivalli starts shooting for Pushpa 2, shares video
అలాగే ఈ చిత్రంలో అనసూయ పాత్ర కూడా మరొకసారి కీలకంగా ఉండబోతుందట. ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ కోసం ఫారెన్ ఫైటర్స్ ని దింపుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలోని ఫైట్స్ సన్నివేశాలు ఏకంగా గాలిలో చేయబోతున్నట్లు సమాచారం. దాదాపుగా 100 అడుగుల ఎత్తులో బన్నీ విలన్సుతో ఫైట్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇందుకోసం అల్లు అర్జున్ 100 అడుగుల ఎత్తులో వేలాడదీస్తారని సమాచారం. కానీ అల్లు అర్జున్ ఇందు కోసం దూకు లేకుండా ఫైట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది ఈ విషయం ఇండస్ట్రీలో తెగ వైరల్ గా మారుతోంది.