విజ‌య్ వ‌ర్మ‌ను త‌మ‌న్నా ఎలా బుట్ట‌లో వేసుకుందో తెలుసా.. ఆ ఒక్క మాట‌కే ప‌డిపోయాడ‌ట‌!?

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, బాలీవుడ్ న‌టుడు విజ‌య్ వ‌ర్మ రిలేష‌న్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. `ల‌స్ట్ స్టోరీస్ 2` వెబ్ సిరీస్ ద్వారా ఏర్ప‌డ్డ వీరి పరిచ‌యం ప్రేమ‌గా మార‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌లేదు. ఈ ఏడాది న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌ను త‌మ‌న్నా, విజ‌య్ జంట‌గా గోవాలో సెల‌బ్రేట్ చేసుకోవ‌డంతో.. వీరి ల‌వ్ ఎఫైర్ బ‌య‌ట ప‌డింది. రీసెంట్ గా ల‌స్ట్ స్టోరీస్ ప్ర‌మోష‌న్స్ లో విజ‌మ్, త‌మ‌న్నా అంద‌రి అనుమానాల‌ను నిజం చేశారు.

తామిద్ద‌రం ల‌వ్ లో ఉన్నామ‌ని అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేశారు. అయితే విజ‌య్ వ‌ర్మ‌ను త‌మ‌న్నా ఎలా బుట్ట‌లో వేసుకుందో తెలుసా..? తాజాగా ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. దర్శకుడు సుజయ్ ఘోష్ ఆఫీస్ లో ఇద్దరూ `ల‌స్ట్ స్టోరీస్ 2` సీరిస్ కోసం మాట్లాడుకుంటున్నారట. అయితే ఆ స‌మ‌యంలో త‌మ‌న్నా `17 ఏళ్లుగా నటిస్తున్నాను. ఇంత‌వ‌ర‌కు ఏ హీరోకు లిప్ కిస్ ఇవ్వ‌లేదు. స్క్రీన్ మీద నేను లిప్ కిస్ ఇచ్చిన మొట్టమొదటి నటుడు నువ్వే` అని విజయ్ వర్మతో చెప్పిందట.

ఆ మాట‌కే విజ‌య్ వ‌ర్మ ప‌డిపోయాడ‌ట‌. త‌మ‌న్నా అలా చెప్పిన వెంట‌నే విజయ్ వర్మ ఏం మాట్లాడాలో తెలియ‌క కృతజ్ఞతా పూర్వకంగా చూశాడట. ఈ విష‌యాన్ని ఓ ఇంట‌ర్వ్యూలో విజ‌య్‌, త‌మ‌న్నా పంచుకున్నారు. కాగా, ల‌స్ట్ స్టోరీస్ లో త‌మ‌న్నా చాలా బోల్డ్ గా న‌టించింది. విజ‌య్‌ వర్మతో ఆమె ఇంటిమేట్ సీన్స్‌, లిప్ లాక్ సీన్స్ లో నటించింది. అదేమిటని అడిగితే పాత్రలు డిమాండ్ చేసినప్పుడు తప్పదు అంటూ త‌మ‌న్నా తేల్చేసింది.