తెలుగు చిత్ర పరిశ్రమ అనగానే ముందుగా నాలుగుకుటుంబాలే అని అంటుంటారు. నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఇలా నాలుగు కుటుంబాల చేతిలోనే ఇండస్ట్రీ ఉందనే వాదన తరచూ వింటూనే ఉంటాం. అయితే ఈ కుటుంబాలు కాకుండా మిగతా ఫ్యామిలీలు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో బాగానే నిలదొక్కుకున్నాయి. కొన్ని విభాగాల్లో కొన్ని కుటుంబాల ఆధిపత్యం బాగానే కనిపిస్తుంది అందులో దర్శక ధీరుడు రాజమౌళి కుటుంబం కూడా ఒకటి.
ఈ కుటుంబం నుంచి ఏకంగా 13 మంది తెలుగు చిత్ర పరిశ్రమల్లో ఆయా విభాగాల్లో కొనసాగుతూ వస్తున్నారు. ముందుగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మంచి రచయిత రాజమౌళి తెరకెక్కించే సినిమాలకు ఆయనే కథలు అందిస్తారు. అలాగే రాజమౌళి సోదరుడు కీరవాణి ఇండియాలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్నాడు. రాజమౌళి తెరకెక్కించే సినిమాలకు కీరవాణి సంగీతం అందిస్తారు.
మరో మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ మాలిక్ కూడా రాజమౌళికి అన్నయ్య అవుతాడట.
అలాగే విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి స్వయంగా రమా రాజమౌళికి మేనమామ కొడుకు.చంద్రశేఖర్ యేలేటి స్వయంగా గుణ్ణం ఊర్మిళకు అన్నయ్య. ఇక ప్రఖ్యాత దర్శకుడు గుణ్ణం గంగరాజు భార్యే ఊర్మిళ. ఇక ఈమె లిటిల్ సోల్జియర్స్, అయితే, యమదొంగ వంటి మూవీస్ కి ప్రొడ్యూసర్ కూడా అంతేకాదు రమా, వల్లీలకు ఊర్మిళ కజిన్. ఇలా వీరి కుటుంబంలో రాజమౌళి,చంద్రశేఖర్ యేలేటి, గుణ్ణం గంగరాజు ఇలా ముగ్గురు డైరెక్టర్లున్నారు.
రాజమౌళి భార్య రమా రాజమౌళి కాస్ట్యూమ్ డైజనర్ గా, కొడుకు కార్తికేయ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుంటే, ఇక కీరవాణి భార్య వల్లీ కూడా ప్రొడ్యూసర్ గా ఉంటున్నారు. అంతేకాకుండా రాజమౌళి సోదరి ఎంఎం శ్రీలేఖ కూడా మ్యూజిక్ డైరెక్టర్గా, సింగర్ గా టాలీవుడ్ లో కొనసాగుతుంది. ఇలా ఈ కుటుంబం నుంచి నలుగురు దర్శకులు, ముగ్గురు సంగీత దర్శకులు ఒకే కుటుంబం నుంచి వచ్చినవారు.
అలాగే కీరవాణి కొడుకు కాలభైరవ కూడా సింగర్ గా, మరో కొడుకు సింహా హీరోగా తెలుగులో కొనసాగుతున్నారు. అలాగే యమదొంగ నిర్మాత చెర్రీ కూడా రాజమౌళికి బంధువే.. అలానే
సన్ సైన్ హాస్పిటల్ చైర్మన్ కూతురు కావ్య చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. ఇక ఈమె రాజమౌళికి కోడలు వరస అవుతుంది.