పవన్ కళ్యాణ్ తలరాత మారబోతుందా..? చేతికి తాబేలు ఉంగరం దేనికోసం పెట్టుకున్నారో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న పేరుకి ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయనని హీరోగా కాదు దేవుడులా భావిస్తూ ఉంటారు ఆయన అభిమానులు . పవర్ స్టార్ అన్న పేరు వినగానే ఏదో తెలియని పులకరింపు వచ్చేస్తుంది.. పవన్ కళ్యాణ్ అన్న పేరు వింటే చాలు జనాలకు తెలియకుండానే పూనకాలు వచ్చినట్లు ఊగిపోతారు .. ఆ పేరులోనే ఆ పవర్ ఉంది అంటూ చెప్పుకొస్తూ ఉంటారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు. అటు సినిమాలను ఇటు పాలిటిక్స్ ని రెండింటిని సమాంతరంగా బ్యాలెన్స్ చేస్తూ రెండు కళ్ళు మాదిరి చూసుకుంటూ వస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో టాప్ పొజిషన్లో ఉన్నాడు రాజకీయాలలోనూ అలాగే టాప్ పొజిషన్ లోకి వెళ్లాలని సతవిధాల ప్రయత్నిస్తున్నారు .

ఈ క్రమంలోని త్వరలోనే జరగబోయే 2024 ఎన్నికలపై గట్టిగా ఫోకస్ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఈ నెలలోనే సినిమా షూటింగ్స్ అన్నీ కంప్లీట్ చేసి టోటల్గా ఇక రాజకీయాలకి తన జీవితాన్ని అంకితం చేయాలని పక్కగా ఫిక్స్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ . ఈ క్రమంలోనే ఎలక్షన్స్ కంపెయ్నింగ్ కోసం పవర్ స్టార్ వారాహి వాహనాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు . కాగా ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ జ్యోతిష్యాన్ని ఎక్కువగా నమ్ముతారు అన్న విషయాన్ని చాలా తక్కువ మందికే తెలుసు.

జ్యోతిష్య శాస్త్రాన్ని కూడా పవన్ నమ్ముతారు అని మరోసారి ప్రూవ్ అయింది . ఎటువంటి ఆటంకాలు లేకుండా అధికారాన్ని సాధించడం కోసం శాస్త్రం ప్రకారం చేయాల్సిన అన్ని విషయాల్లోనూ గట్టిగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది . ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన చేతికి తాబేలు ఉంగరాన్ని ధరించారు . ఆయన తన కుడి చేతి ఉంగరం వేలకు బంగారంతో తయారు చేసిన తాబేలు ఉంగరాన్ని పెట్టుకున్నారు. ఇది రీసెంట్ గానే ఓ ప్రచార సభలో బయటపడింది . తాబేలు ఉంగరం ఎంత ప్రాముఖ్యతను కలిగి ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తాబేలు ఉంగరం పెట్టుకుంటే పాజిటివ్ శక్తి వస్తుంది అంటూ జ్యోతిష్య శాస్త్రంలో రాసి ఉన్నారు. అంతేకాదు ఆత్మవిశ్వాసం పెరుగుతుందట . మహా విష్ణువు అవతారంలో ఒకటి తాబేలు. అందుకే ఇది చాలా పవర్ఫుల్ అంటూ ఉంటారు . అలాంటి పవర్ఫుల్ అయిన తాబేలు ఉంగరం పవర్ స్టార్ పెట్టుకోవడంతో నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ చెబుతున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ . అంతేకాదు ఈ తాబేలు ఉంగరమే పవన్ కళ్యాణ్ తల రాత మార్చబోతుందని ..2024 లో కొత్త సీఎం రాబోతున్నాడు అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రచారం చేస్తున్నారు . చూడాలి మరి పవన్ కళ్యాణ్ కి తాబేలు ఉంగరం ఏవిధంగా కలిసి వస్తుందో..?