ఇన్నాళ్లకు ఆ కోరిక తీర్చుకోబోతున్న దిపీక పదుకునే.. స్టార్ తెలుగు హీరోతో రొమాన్స్ కి సై..!?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న దీపికా పదుకొనే అంటే తెలుగు హీరోలకి .. తెలుగు జనాలకి అదోరకమైన తెలియని ఇష్టం. ఎటువంటి రోల్స్ నైనా సరే దీపికా పదుకొనే అలవోకగా చేస్తుంది. బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులను అందుకున్న దీపికా.. మరీ ముఖ్యంగా రీసెంట్గా ఆస్కార్ అవార్డులో కూడా స్టేజ్ పై మెరిసి తనదైన హెల్ప్ చేసి తెలుగు అభిమానులని అట్రాక్ట్ చేసింది .

ఇదే క్రమంలో దీపికా పదుకొనే తెలుగులో మరో ఆఫర్ ని అందుకుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పటికే ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్టుకే సినిమాలో దీపిక పదుకొనే నటిస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమా రిలీజ్ కాకముందే మరో బడా ఆఫర్ ని పట్టేసింది దీపికా పదుకునే అంటూ సినీ వర్గాలలో ప్రచారం మొదలైంది. టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సైన్ చేసిన సినిమా ఎన్టీఆర్ 31 .

ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ క్రమంలోనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనేను హీరోయిన్గా ఫిక్స్ చేసినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. దీపిక పదుకొనే కి కూడా ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని .. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలి అని ఉంది అంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చారు. ఇలా ఇన్నాళ్లకు ఆమె తన కోరికను నెరవేర్చుకో బోతుంది అంటున్నారు ఫ్యాన్స్..!!