ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ప్రఖ్యాత డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ మూవీ లో ఎన్టీఆర్, చరణ్ సరసన అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఎన్టీఆర్, చరణ్ కు సంబంధించిన టీజర్లు విడుదలై ఆకట్టుకున్నాయి. నిన్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మికంగా మృతిచెందడంతో ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ ను విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యాజమాన్యం ప్రకటించింది.
కాగా తాజాగా ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ ఎప్పుడు విడుదల చేస్తున్నది మేకర్స్ ప్రకటించారు. 45 సెకండ్ల నిడివిగల ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ నవంబర్ 1వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నట్లు ఆర్ఆర్ఆర్ టీం ప్రకటించింది. కాగా ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల పై మెగా, నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల కానుంది.
Releasing a 45 second glimpse of #RRRMovie on Nov 1st at 11 AM.
🔥🌊#RRRGlimpse 🤟🏻⚡️@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @mmkeeravaani @ajaydevgn @aliaa08 @oliviamorris891 @DVVMovies @PenMovies @jayantilalgada pic.twitter.com/RS99Alr51e— RRR Movie (@RRRMovie) October 30, 2021