టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్, మెహ్రీన్ కౌర్ జంటగా నటించిన తాజా చిత్రమే `మంచి రోజులు వచ్చాయి`. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వీ.సెల్యులాయిడ్, ఎస్.కె.ఎన్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మితమైంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం చిత్రం నవంబర్ 4న విడుదల కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే మేకర్స్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. లవ్, రొమాన్స్, కామెడీ నేపథ్యంలోని సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంటోంది. సంతోష్ తో ప్రేమలో ఉన్న మెహ్రీన్.. కొలీగ్ తో స్నేహం చేస్తున్నట్లు తన తండ్రితో చెప్పడం.. కూతురి బిహేవియర్ మీద డౌట్ వచ్చి ఆమె తండ్రి ఇన్వెస్టిగేషన్ చేయడం వంటివన్నీ బోలెడంత ఫన్ ని క్రియేట్ చేస్తున్నాయి.
మారుతి మార్క్ కామెడీ ట్రైలర్‌గా స్పష్టంగా కనిపించింది. ఇక సంతోష్ శోభన్ – మెహ్రీన్ జంట మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కవుట్ అయింది. మొత్తానికి అదిరిపోయిన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. మరి ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.