ఒక్క మాటలో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులను సాయి పల్లవి ఫుల్ ఖుషీ చేసేసింది. ఇంతకీ సాయి పల్లవి చెప్పిన ఆ ఒక్క మాట ఏంటో తెలుసుకోవాలనుందా.. మరి లేటెందుకు అసలు మ్యాటర్‌లోకి వెళ్లిపోదాం పదండీ… సాయి పల్లవి, నాగ చైతన్య జంటగా నటించిన `లవ్ స్టోరి` చిత్రం సెప్టెంబర్ 24న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
దాంతో సినీ ప్రముఖులు సైతం తమదైన శైలిలో లవ్ స్టోరిపై రివ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు కూడా సినిమా బాగుందని చెప్పుకొచ్చారు. మరియు సాయి పల్లవి డ్యాన్స్ అద్భుతంగా చేసిందని, అసలు ఆమె శరీరంలో బోన్స్ ఉన్నాయా? ఇంతవరకూ స్క్రీన్ పై అలాంటి డాన్స్ చూడలేదు అంటూ ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశాడు.
ఇక మహేష్ బాబు ట్వీట్‌కు ఆనందంతో ఉబ్బితబ్బిపోయిన సాయి పల్లవి.. సూపర్ రిప్లై ఇచ్చింది. `మీ మాటలు నాకు మరింత ఎనర్జీని ఇస్తున్నాయి. మీ ప్రశంసలకు విధేయురాలిని సార్. నాలో ఉన్న మీ అభిమాని మీరు చేసిన ట్వీట్ ను ఈ పాటికే మిలియన్ టైమ్స్ చదివేసింది` అంటూ ఆనందం వ్యక్తం చేసింది. అయితే సాయి పల్లవి ట్వీట్లో తాను మహేష్ అభిమానినే అని డైరెక్ట్‌గా చెప్పడంతో.. ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
https://twitter.com/Sai_Pallavi92/status/1442073055677714433?s=20