`లక్ష్య`పై న్యూ అప్డేట్‌..టార్గెట్ ఫిక్స్ చేసుకున్న నాగశౌర్య‌!

టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య హీరోగా ధీరేంద్ర సంతోష్‌ జాగర్లపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `ల‌క్ష్య‌`. భారతదేశ ప్రాచీన విద్య ఆర్చెరీ నేపథ్యంతో రూపుదిద్దుకున్న ఈ మూవీలో కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ ఎల్‌ పీ, నార్త్ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్ల పై నిర్మిత‌మైన ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందించాడు.

Lakshya: Shooting of Naga Shaurya's sports-drama nearing completion |  Telugu Movie News - Times of India

ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా నాగ‌శౌర్య థియేట‌ర్స్‌లోకి దిగేందుకు టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడు. అవును, తాజాగా మేక‌ర్స్ ల‌క్ష్య రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్ర‌క‌టించారు.

Image

తాజాగా నవంబర్ 12వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్టు చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ స్పోర్ట్స్‌ డ్రామాలో నాగ శౌర్య రెండు విభిన్నమైన గెటప్పుల్లో కనిపించబోతోన్నారు. కాగా, నాగ‌శౌర్య న‌టించిన మ‌రో చిత్రం `వరుడు కావలెను` అక్టోబర్ 15న‌ ద‌స‌రా కానుక‌గా రిలీజ్ కాబోతున్న విష‌యం తెలిసిందే.