బిగ్‌బాస్ ప్రియుల‌కు గుడ్‌న్యూస్‌..తెర‌పైకి ఓటీటీ ప్లాన్..?!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్ప‌టికే నాలుగు సీజ‌న్ల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుని.. ఐదో సీజ‌న్‌లోకి అడుగు పెట్టింది. సెప్టెంబ‌ర్ 5న అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన సీజ‌న్ 5 ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్టైన్ చేస్తూ అద్భుతంగా దూసుకుపోతోంది. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం..బిగ్ బాస్ తెలుగు ఓటీటీ వెర్షన్ ను కూడా మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Bigg Boss 5 Telugu: Nagarjuna hikes his remuneration

క‌రోనా త‌ర్వాత ఓటీటీ మార్కెట్ పెరగడంతో హిందీ బిగ్‌బాస్‌ నిర్వాహకులు సరికొత్త కార్యక్రమానికి తెరతీశారు. ఇందులో భాగంగా బిగ్‌బాస్‌ ఓటీటీ పేరుతో మిని బిగ్‌బాస్‌ను నిర్వహించారు. ఈ షోకు కరణ్‌ జోహార్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌గా.. ఇది విజ‌య‌వంతంగా పూర్తి అయింది. ఈ నేప‌థ్యంలోనే తెలుగులోనూ దీనిని అమ‌లు చేయాల‌ని చూస్తున్నారు నిర్వాహ‌కులు.

Bigg Boss Telugu (TV Series 2017– ) - IMDb

ఇందుకోసం డిస్నీ ప్ల‌స్‌ హాట్ స్టార్ తో డీల్ కుదుర్చుకున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆరు వారాల పాటు కొన‌సాగ‌నున్న ఈ ఓటీటీ బిగ్‌బాస్‌లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు. ఓటీటీ వెర్షన్ లో ఫైనల్ కు చేరుకున్న ఒకర్ని నేరుగా బిగ్ బాస్ సీజన్-6కి ప్రమోట్ చేస్తార‌ట‌. ప్ర‌స్తుతం ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నార‌ని టాక్. ఇది ఒక ర‌కంగా బిగ్‌బాస్ ప్రియుల‌కు గుడ్‌న్యూస్ అనే చెప్పాలి.