అతని కోసమే బరువు పెరిగానంటున్న శ్రుతి హాసన్..?

స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ప్రస్తుతం కొద్దిగా బరువు పెరిగిందని సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. అందుకుగల కారణం బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రానికి ఈమె హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. అందులో శృతిహాసన్ ఒక మెయిన్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈ సినిమాకి ముందుగా హీరోయిన్ త్రిష ని కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే ఈ సినిమాలో చివరి గా శృతిహాసన్ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే శృతి హాసన్ తో డైరెక్టర్ గోపీచంద్ బలుపు,క్రాక్ అలాంటి సినిమాలను తెరకెక్కించారు. ఇక ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాయి. అందుచేతనే శ్రుతిహాసన్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

I don't know who is AR Rahman, says Nandamuri Balakrishna | Entertainment  News,The Indian Express

బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. రౌడీయిజం అనే టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు వార్తలు వచ్చిన వాటిని ఆ మూవీమేకర్స్ ఈ టైటిల్ ని కొట్టిపారేశారు.ఈ సినిమా కోసమే శృతిహాసన్ కొద్దిగా బరువు పెరిగినట్టుగా సమాచారం. ఈ సినిమాలో ఈమె ఒక గృహిణి పాత్రలో నటిస్తున్న అందువల్ల ఆమె కొద్దిగా బరువు పెరగడానికి ట్రై చేస్తున్నట్లు సమాచారం.