తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని.. ఐదో సీజన్లోకి అడుగు పెట్టింది. సెప్టెంబర్ 5న అట్టహాసంగా ప్రారంభమైన సీజన్ 5 ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ అద్భుతంగా దూసుకుపోతోంది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం..బిగ్ బాస్ తెలుగు ఓటీటీ వెర్షన్ ను కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
కరోనా తర్వాత ఓటీటీ మార్కెట్ పెరగడంతో హిందీ బిగ్‌బాస్ నిర్వాహకులు సరికొత్త కార్యక్రమానికి తెరతీశారు. ఇందులో భాగంగా బిగ్‌బాస్ ఓటీటీ పేరుతో మిని బిగ్‌బాస్‌ను నిర్వహించారు. ఈ షోకు కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరించగా.. ఇది విజయవంతంగా పూర్తి అయింది. ఈ నేపథ్యంలోనే తెలుగులోనూ దీనిని అమలు చేయాలని చూస్తున్నారు నిర్వాహకులు.
ఇందుకోసం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో డీల్ కుదుర్చుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఆరు వారాల పాటు కొనసాగనున్న ఈ ఓటీటీ బిగ్‌బాస్‌లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు. ఓటీటీ వెర్షన్ లో ఫైనల్ కు చేరుకున్న ఒకర్ని నేరుగా బిగ్ బాస్ సీజన్-6కి ప్రమోట్ చేస్తారట. ప్రస్తుతం ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని టాక్. ఇది ఒక రకంగా బిగ్‌బాస్ ప్రియులకు గుడ్‌న్యూస్ అనే చెప్పాలి.