ప్రజలను మోసం చేశాము అంటున్న నిర్మాతలు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా సినిమా టికెట్లపై కొన్ని కండిషన్స్ లను తెలియజేస్తోంది. కేవలం సినిమా టిక్కెట్లు ఆన్లైన్ ద్వారానే విక్రయించే అంశంపై ఏపీ మంత్రి పేర్ని నాని తో సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్, నిర్మాత సి.కళ్యాణ్, ఆదిశేషగిరిరావు, మైత్రి మూవీ మేకర్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజ్, ఇలా ఎంతో మంది ప్రముఖులతో పాటుగా థియేటర్ యాజమానులు కూడా హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా సి.కల్యాణ్ మాట్లాడుతూ”మాలో తప్పు జరగలేదని కాదు డెఫినెట్ గా తప్పులు జరిగినవి. ఎందుకంటే ఇంతకుముందు ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళాము. అప్పుడు వాళ్ళు మీటింగ్ పెట్టగానే ఫైళ్ళు తీసి , ప్రతి ఒక్క ఏడాదిలో 200 కోట్లు ,600 కోట్లు, 2000కోట్లు కలెక్షన్లని బాక్సాఫీస్ బ్లాక్ బాస్టర్ అని ఉంది..ఇది ఇలా ఉంటే మీరు ఎందుకు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని అన్నారు.ఇంత కలెక్షన్లు వస్తున్నప్పుడు మీకు ఇబ్బంది ఏముంది అని ఫైనాన్స్ మినిస్టర్ తెలిపారు..

 

అప్పుడు నేను కేవలం ప్రజలను మోసం చేయడానికి మాత్రమే ఇలాంటి కోట్ల సాధించాయని చెబుతాము సార్ ..ఎందుకంటే ఇంతటి కలెక్షన్లు రాబట్టిన సినిమాలను మేము ఎందుకు చూడలేదు అని ప్రేక్షకులు భ్రమపడి ఎట్టకేలకు సినిమా చూస్తారని ఒక ఆలోచనతోనే ఇలాంటివి చేస్తూ ఉంటాము అని తెలిపాను. ఇక సినిమా అంటేనే కలర్ ఫుల్ మాయలు.. ఇంతటి కలెక్షన్లు రాబట్టిన సినిమాలు అయితే ఇప్పటివరకు లేవు.. మేము ఇబ్బందులు పడుతు న్నప్పుడు సీఎం గారిని కలిస్తే ఆయన మిమ్మల్ని కలవమన్నారు సార్ అని తెలిపాడు కళ్యాణ్.