బిగ్‌బాస్ ప్రియుల‌కు గుడ్‌న్యూస్‌..తెర‌పైకి ఓటీటీ ప్లాన్..?!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్ప‌టికే నాలుగు సీజ‌న్ల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుని.. ఐదో సీజ‌న్‌లోకి అడుగు పెట్టింది. సెప్టెంబ‌ర్ 5న అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన సీజ‌న్ 5 ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్టైన్ చేస్తూ అద్భుతంగా దూసుకుపోతోంది. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం..బిగ్ బాస్ తెలుగు ఓటీటీ వెర్షన్ ను కూడా మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. క‌రోనా త‌ర్వాత ఓటీటీ మార్కెట్ పెరగడంతో హిందీ బిగ్‌బాస్‌ నిర్వాహకులు సరికొత్త కార్యక్రమానికి తెరతీశారు. ఇందులో భాగంగా […]