చిరంజీవి, రామ్ చరణ్ తండ్రీ కొడుకులు కాదంటున్నాడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ. అయితే ఇది రియల్ లైఫ్‌లో కాదండోయ్.. రీల్ లైఫ్‌లో. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ఆచార్య. ఈ చిత్రంలో రామ్ చరణ్ సిద్ధా అనే కీలక పాత్ర పోషిస్తున్నారు.
అలాగే ఈ చిత్రంలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్, చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో చిరు, చరణ్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారని, చరణ్ రోల్ చాలా చిన్నగా ఉంటుందని ఇలా రకరకాల వార్తలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా కొరటాల ఈ వార్తలపై ఓ క్లారిటీ ఇచ్చారు.
కొరటాల మాట్లాడుతూ.. ఈ సినిమాలో చరణ్ చేస్తున్నది గెస్టు రోల్ కాదు. ఆచార్యలో మెయిన్ ఎమోషన్ చరణ్ చుట్టూనే రన్ అవుతుంది. సెకండాఫ్ దాదాపు తన పాత్ర కనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో చిరంజీవి – చరణ్ తండ్రీ కొడుకులుగా కనిపించనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అందులో ఎంతమాత్రం నిజం లేదు. ఆశయం పరంగానే వాళ్ల మధ్య అనుబంధం ఉంటుంది. ఇక పదిరోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది అని తెలిపారు.