భ‌ర్త చెంప చెల్లుమ‌నిపించిన ప్ర‌ముఖ హీరోయిన్‌..వీడియో వైర‌ల్‌!

నువ్వు నేను సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అనిత‌.. మొద‌టి సినిమాతోనే తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. ఈ చిత్రం త‌ర్వాత ప‌లు సినిమాలు చేసిన స‌క్సెస్ కాలేక‌పోయిన అనిత బాలీవుడ్‌కు మ‌కాం మార్చి.. అక్క‌డ ప‌లు చిత్రాలు మ‌రియు సీరియ‌ల్స్ చేస్తూ మెప్పించింది.

ఇక 2013లో వ్యాపారవేత్త రోహిత్ రెడ్డిని పెళ్లి చేసుకున్న అనిత్‌.. ఏడేళ్ళ అనంతరం ఇటీవ‌లె ఒక మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా అనిత తన భర్త రోహిత్‌ రెడ్డిని ఓ ఆటాడుకుంది. జస్ట్‌ ప్రాంక్‌ అని చెప్తూ భర్త చెంప పగలగొట్టింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.

ఈ వీడియోలో అనిత తన భర్తను కుర్చీలో కూర్చోబెట్టింది. అతడి వెనకాల నిలబడిన అనిత‌ తన చేతిలో ఓ దారాన్ని పట్టుకున్నట్లు నటించింది. దాన్ని అతడి చెవిలో నుంచి తీసినట్లు యాక్ట్‌ చేసింది. ఇంతలోనే ఫడేలుమని భ‌ర్త‌ చెంప మీద లాగి కొట్టింది. దీంతో ఒక్క‌సారిగా షాకైన భర్త తనను ఏమీ అనలేక ప‌రార్ అయ్యాడు. ఇక ఈ వీడియోను అభిమానుల‌తో పంచుకున్న అనిత‌.. ఈ ట్రిక్‌ను అంద‌రూ ట్రై చేయాల‌ని సూచించింది.

https://www.instagram.com/p/CPKxijHgI62/?utm_source=ig_web_copy_link