టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోలుగా గ్లోబల్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి నటించిన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ సినిమాతోను సంచలనాలు సృష్టించారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఫ్రెండ్షిప్కు మారుపేరుగా జూనియర్ ఎన్టీఆర్, చరణ్ పేర్లు వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి ఈ ఇద్దరు స్టార్ హీరోలకు తీరని ఓ కోరిక ఉందట. అటు తారక్, ఇటు చరణ్ ఇద్దరికీ ఆ కోరిక ఇప్పటికీ అలానే ఉండిపోయిందట. అది కూడా ఇండస్ట్రీకి సంబంధించిన డ్రీమ్ కావడం విశేషం. ఇంతకీ ఆ తీరని కోరిక మరేదో కాదు.
ఇద్దరు స్టార్ హీరోలకు అనుష్క అంటే చాలా ఇష్టమట. అనుష్కతో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ మాత్రం వాళ్లకు లేకుండా పోయింది. గతంలో ఎన్నోసార్లు వీళ్ళిద్దరి కాంబో సెట్ చేయాలని దర్శకులు ప్రయత్నించినా.. అది వర్కౌట్ కాలేదు. కొన్నిసార్లు సెలెక్ట్ అయినట్లు అయి మిస్ కావడం.. మరి కొన్నిసార్లు ఏవో కారణాలతో అనుష్క సినిమాను రిజెక్ట్ చేయడం లాంటివి జరుగుతూ వచ్చాయి. మరీ ముఖ్యంగా.. రామ్ చరణ్, అనుష్క కాంబోలో మగధీర సినిమా రావాల్సిందట. అయితే అనుష్క సినిమాను రిజెక్ట్ చేసింది. చరణ్ నాకు తమ్ముడిలా ఉంటాడు స్క్రీన్ పై మా ఇద్దరికీ కెమిస్ట్రీ అసలు వర్కౌట్ కాదని ఆమె అవకాశాన్ని వదులుకుందట.
ఇక తారక్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ వచ్చిన దానిని కూడా మిస్ చేసుకుంది. అంతేకాదు గతంలో ఎన్టీఆర్ నటించిన బృందావనం సినిమాలను కాజల్ ప్లేస్ లో అనుష్కను భావించారట. కానీ ఆ అవకాశాన్ని కూడా ఆమె వదులుకుంది. అయితే తారక్ మాత్రం అనుష్కతో ఒక్క నిమిషం జస్ట్ అలా మెరిసి మాయమయ్యాడు. అది కూడా విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన చింతకాయల రవి సినిమాలో ఓ సాంగ్‌లో. అంతేతప్ప ఇప్పటివరకు ఈ ఇద్దరు స్టార్ హీరోలకు అనుష్కతో స్క్రీన్ షేర్ చేసుకునే ఒక సందర్భం కూడా రాలేదు. ఇకపై కూడా వచ్చే అవకాశం లేదు.