దాన్ని నడిరోడ్డుపై కొడతా నయనతార పై స్టార్ హీరో భార్య షాకింగ్ కామెంట్స్..!

సౌత్‌ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తిరుగులేని ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న నయనతారకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికీ బిజీగా దూసుకుపోతుంది. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మూడు దశాబ్దాలు దాటుతున్నా.. అమ్మడి క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఇలాంటి క్రమంలోనే నయనతారకు సంబంధించిన షాకింగ్ న్యూస్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది.

I did it all for him! The girl in me believed compromises were essential for love: Nayanthara

నయనతారను ఉద్దేశిస్తూ ఓ స్టార్ హీరో భార్య చేసిన సంచలన కామెంట్స్ హాట్‌ టాపిక్ గా మారాయి. అది కనిపిస్తే రోడ్ పైనే కొడతా అంటూ నయనతారను అవమానించిన హీరో భార్య ఎవరో.. అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. ఆమె మరెవరో కాదు ప్రభుదేవా మొదట భార్య. తనను ప్రేమించి పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత నయనతార ప్రేమలో పడిన ప్రభుదేవా.. ఆమెను వివాహం చేసుకోవాలని.. మొదటి భార్యకు విడాకులు ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే నయనతార తన భర్తను వలలో వేసుకుందని తెలిసిన రమాలత.. మీడియా ముందుకు వచ్చి నాయనతరపై విమర్శలు కురిపించింది.

When Prabhudeva's ex-wife accused Nayanthara for breaking her house

నా భర్త దేవుడిలాంటి వాడిని.. కానీ నా భర్తను మాయ చేసి వలలో వేసుకుందని.. కుటుంబ చట్ట ప్రకారం భార్య ఉండగా మరో అమ్మాయి వారి లైఫ్ లోకి వస్తే ఏం చేయాలో అదే చేస్తానని.. ఆమెను చట్ట ప్రకారం అరెస్ట్ చేసి జైల్లో వేయాలని.. ఆమె ఒక్క బ్యాడ్ లేడీ అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. అంతేకాదు.. నయనతార రోడ్ పై కనిపిస్తే అక్కడే కొడతా అంటూ మీడియా ముందు సంచలన కామెంట్స్ చేసింది. అలా నయనతారపై.. ప్రభుదేవా మొదటి భార్య తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ నయనతార, ప్రభుదేవ లకు కూడా బ్రేకప్ అయిపోయింది. వీరి మధ్య బంధం పూర్తిగా తెగిపోయింది.