టాలీవుడ్ బడా ఫ్యామిలీలో ఒకటైన నందమూరి కుటుంబం చరిత్ర ఎలాంటిదో అందరికీ తెలిసిందే. నందమూరి కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన దివంగత సీనియర్ ఎన్టీఆర్ వేసిన బీజం.. ఇప్పటికీ చిగురిస్తూనే ఉంది. ఇప్పటికే మూడు జనరేషన్‌ల హీరోలు నందమూరి కుటుంబం నుంచి ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ హీరో గానే కాదు.. డైరెక్టర్గా, నిర్మాతగాను సత్తా చాటుకున్నారు. ఈ క్రమంలోనే ఈ కుటుంబం నుంచి ఇండస్ట్రీలో 11 బ్యానర్లు ఉన్నాయి. ఇంతకీ ఆ బ్యానర్లు ఏంటో.. ఎవరెవరు స్థాపించారో చూద్దాం.
మొదటి స్థాపించినది ఎన్ఏటి (నేషనల్ ఆర్ట్స్) బ్యానర్. ఎన్టీఆర్ సోదరుడు నందమూరి త్రివిక్రమ్ రావు ఈ బ్యానర్ను స్థాపించి ఎన్టీఆర్ ను హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించారు. అప్పట్లో ఈ బ్యానర్ కు మంచి పేరుంది. దాని తర్వాత ఎన్టీఆర్ పెద్ద తనయుడు రామకృష్ణ మరణంతో.. ఆయన గుర్తుగా రామకృష్ణ సీనీ స్టూడియోస్‌ను నందమూరి కుటుంబం స్థాపించింది. ఈ బ్యానర్ వ్యవహారాలు నందమూరి మోహనకృష్ణ, జయకృష్ణ చూసుకునేవారు.
ఇక ఈ బ్యానర్ తర్వాత కూడా ఎన్టీఆర్ ఆయన కొడుకులు రకరకాల బ్యానర్లను స్థాపించి పలు సినిమాలను రూపొందించారు. అలా.. తారకరామా ఫిలిం యూనిట్, బసవ రామ తారక ప్రొడక్షన్స్, రామకృష్ణ హార్టికల్చరల్ స్టూడియోస్, శ్రీమత్ కంబైన్స్ బ్యానర్‌లను స్థాపించారు. యువరత్న, ఎన్బికె ఆర్ట్స్ బ్యానర్‌లను బాలయ్య పేరుతో స్థాపించి ఆయన హీరోగా ఎన్నో సినిమాలు రూపొందించారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ మనవడు నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ రన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఎన్నో సినిమాలను నిర్మించిన ఆయన తాను హీరోగా చేస్తున్న సినిమాలను సైతం ఈ బ్యానర్ లోనే రూపొందిస్తున్నాడు. అంతే కాదు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జై లవకుశ, రవితేజ కిక్ 2 సినిమాలు కూడా ఇదే బ్యానర్‌లో వచ్చి బ్లాక్ మాస్టర్ గా నిలిచాయి. ఇక తాజాగా ఎన్టీఆర్ మరో తనయుడు నందమూరి జయకృష్ణ ఏర్పాటు చేసిన బ్యానర్.. బసవతారకరామా. ఈ బ్యానర్‌లో సినిమాలు తీయనున్నట్లు అనౌన్స్ చేశారు. అలా ఇప్పటివరకు నందమూరి ఫ్యామిలిలోనే ఏకంగా 11 బ్యానర్‌లు ఉన్నాయి.