టాలీవుడ్‌లో నందమూరి ఫ్యామిలీ హీరోలకు స్పెషల్ ఇమేజ్ ఉంది. నందమూరి తారక రామారావు దగ్గర నుంచి.. ఇప్పుడు రాణిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ వరకు ఈ కుటుంబం నుంచి వచ్చిన చాలామంది హీరోలు ప్రత్యేక ఫ్యాన్ బేస్‌తో దూసుకుపోతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం వాళ్ల నుంచి వస్తున్న సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తూ ఉండడం విశేషం. అయితే.. ఫ్యామిలీ గొడవల వల్ల జూనియర్ ఎన్టీఆర్, బాలయ్య బాబు ఇద్దరి మధ్యన మనస్పర్ధలతో ఇద్దరు దూరమయ్యారని.. నందమూరి కుటుంబం రెండుగా చీలిపోయిందంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఇద్దరు హీరోల తీరు కూడా అలాగే ఉంది.
అయితే.. ఒకప్పుడు ఎంతో మమకారంతో ఉండే ఈ బాబాయి, అబ్బాయిలు ఇప్పుడు ఇంతలా గొడవ పడడానికి కారణం ఏంటి.. అసలు ఈ మనస్పర్ధలు ఎందుకు వచ్చాయి.. ఒకరికొకరు ఎదురుపడిన పలకరించుకోలేనంత పెద్ద గొడవలు ఏమున్నాయి.. అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. ఇక బాలయ్య పద్మభూషణ్ అందుకున్న క్రమంలో తారక్.. బాలయ్య కంగ్రాట్స్ తెలియజేస్తూ ట్విట్ చేశాడు. కానీ.. ఆయన మాత్రం ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. అంటే జూనియర్ ఎన్టీఆర్.. బాలయ్య తో మాట్లాడాలని ప్రయత్నం చేసిన బాలయ్య మాత్రం అసలు మాట్లాడే ప్రసక్తే లేనట్లు మొండి వైఖరిని చూపిస్తున్నారు. ఇక కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇద్దరూ ఓవైపు ఉంటే.. నందమూరి కుటుంబం అంతా మరోవైపు ఉంటుందనటానికి టాపిక్ గా మారింది. ఇక బాలయ్యకు, జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య విభేదాలు రావడానికి అసలు కారణం మాత్రం ఇదేనంటూ స్యూస్ వైరల్‌గా మారుతుంది.
మొదట్లో ఎన్టీఆర్.. టీడీపీ తరఫున ప్రచారం చేసిన.. కొన్ని రోజులుగా బాలయ్య, చంద్రబాబుతో ఆయన సరిగ్గా కలవకపోవడం టీడీపీ తరఫున మాట్లాడకపోవడం వివాదాలకు కారణం అయిందని సమాచారం. అంతేకాదు.. అసెంబ్లీ సాక్షిగా బాలయ్య చెల్లెలు భువనేశ్వరిని ఉద్దేశించి కొడాలి నాని కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసిన.. దానిపై జూనియర్ ఎన్టీఆర్ ఫైర్ అవుతూ ఎలాంటి కామెంట్స్ చేయకపోవడం.. అలాగే చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకు వెళ్లిన ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్, పొలిటిషన్స్ కూడా ఆయనను పరామర్శించారు. కానీ.. కళ్యాణ్ రామ్, తారక్ మాత్రం చంద్రబాబు ఊసే ఎత్తకపోవడంతో బాలయ్య బాబు మరింత ద్వేషాన్ని పెంచుకున్నట్లు సమాచారం. అప్పటి నుంచే ఆ ఇద్దరు అన్నదమ్ములతో నందమూరి ఫ్యామిలీ అసలు మాట్లాడటమేలేదట. బాలయ్య కూడా మొండి వైఖరిని పాటిస్తూనే ఉన్నాడు. మరి ఫ్యూచర్‌లో అయినా వీళ్ళ వివాదాలు ముగిసి మాటలు కలుస్తాయో లేదో వేచి చూడాలి.