సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ డీల్ ఫిక్స్.. ఎక్కడ.. ఎప్పుడు చూడొచ్చంటే..?

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్.. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి కానుక జనవరి 14న అంటే నేడు ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఇక సినిమాలో వెంకటేష్ స‌ర‌సన హీరోయిన్గా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లు కనిపించారు. సాయికుమార్, నరేష్, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో మెరిసిన‌ ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు నిర్మించారు.

Sankranthiki Vasthunam Runtime Revealed | cinejosh.com

బీమ్సి సిసిరోలియా సంగీతం అందించాడు. ఇక ఫన్, ఫ్యామిలీ, డ్రామా, యాక్షన్, ఫాదర్, సెంటిమెంట్ ఇలా అని ఎమోష‌న‌లు కలబోసి సినిమాను రూపొందించడం సినిమాకు మరింత ప్లస్ అయిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి భాగం క్రేజీగా సాగిపోతే.. సెకండ్ హాఫ్ కొంత సాగదీసినట్లు ఉందంటూ సినిమా చూసిన ఆడియన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న వారికి మాత్రం కాస్త క్లైమాక్స్ నిరాశ పరిచినట్లు తెలుస్తోంది. పూర్తి కామెడీ ఎంటర్టైనర్‌గా సినిమా చూసిన ఆడియన్స్ చెబుతున్నారు.

Sankranthiki Vasthunam Movie (Jan 2025) - Trailer, Star Cast, Release Date  | Paytm.com

ఫ్యామిలీతో కలిసి థియేటర్‌లో సినిమా ఎక్స్పీరియన్స్ మరింత బాగుంటుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జి గ్రూప్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక జి ఫైవ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందట. ఇదివరకే అందుతున్న సమాచారం ప్ర‌కారం ఈ సినిమాను ఫిబ్రవరి ప్రారంభంలో ఓటీటీలో స్టీరింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. సంక్రాంతి సెలవుల కారణంగా సినిమా ధియేటర్లో చూడడానికి ఫ్యాన్స్ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్ర‌మంలో సినిమా ఏ రేంజ్‌లో క‌లెక్ష‌న్‌లు కొల్ల‌గొడుతుందో వేచి చూడాలి.