నందమూరి నటసింహం బాలకృష్ణ, యంగ్ డైరెక్టర్ బాబి కాంబోలో తెరకెక్కిన హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తుంది. సంక్రాంతి బరిలో నిలిచిన గేమ్ ఛేంజర్ ఊహించిన రేంజ్‌లో టాక్ రాకపోవడంతో.. డాకు మహారాజ్‌కు మరింత ప్లస్ అయింది. ఈ క్రమంలోనే బాలయ్య సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఇక బాలయ్య యాక్షన్, బాబీ విజన్, థమన్ మ్యూజిక్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే పాజిటివ్ టాక్ తో సాలిడ్ ఓపెనింగ్స్‌ను ప్రారంభించిన డాకు మహారాజ్.. సెకండ్ డే కలెక్షన్లు కూడా అదే రేంజ్ లో కొల్లగొట్టింది.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ మూవీస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య.. భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్‌లో అదరకొట్టాడు. ఓ పక్కన నానాజీ పాత్రలో సదాసీదా డైలాగులతో ఆకట్టుకుంటూనే.. మరో పక్కన డాకు మహారాజ్‌గా తన పవర్ ప్యాకెడ్ పర్ఫామెన్స్‌తో పవర్‌ఫుల్ డైలాగ్‌లతో మెప్పించాడు. ఇక ఈ మూవీలో హీరోయిన్గా శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌట్టెల, సచిన్ ఖేడ్కర్ తదితరులు కీలకపాత్రలో మెప్పించారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబి డియోల్.. స్టైలిష్ విలన్ పాత్రలో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. థమన్ మ్యూజిక్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఇక సినిమా పై రిలీజ్‌కు ముందు పెద్ద అంచనాలు లేకున్నా ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా రూ.80.70 కోట్ల వరకు జరిగింది.
ఇక సినిమా బ్రేక్ ఈవెన్‌కు రూ.82 కోట్లు కొల్లగొట్టాల్సి ఉంది. ఈ క్రమంలోనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన డాకు మహారాజ్ ఫస్ట్ నుంచే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. అలా మొట్టమొదటి రోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రూ.25.35 కోట్ల గ్రాస్ కొల్లగొట్టగా.. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.56 కోట్ల వసూళ్ళు సాధించింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. వీకెండ్ కావడం.. పైగా పండగ కావడంతో.. డాకుమారాజ్ ఫస్టే డే ఈ రేంజ్ కలెక్షన్లు సాధించింది. అయితే సెకండ్ డే కలెక్షన్స్ కూడా ఇంచుమించు ఇలాగే సాగాయి. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 13.5 కోట్ల వసూలు రాగా.. రెండు రోజులకు కలిపి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రూ.38.8 కోట్ల వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.74 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది. ఇక ఇప్పటికీ బాలయ్య దూకుడు థియేటర్ అలాగే కొనసాగుతుంది. ఫుల్ ఆక్యుఫెన్సీతో సినిమా రన్ అవుతుంది. ఇదే జోరు ఈ వారం అంత కనిపిస్తే కలెక్షన్లు భారీగా పెరగడం కాయం.