పెళ్ళికొడుకుగా మెరిసిన ప్రభాస్.. .. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎప్పటినుంచి ఆయన పెళ్లి వార్త కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ పెళ్లి కొడుకు గా మారిన ఫొటోస్ నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి. దీంతో ఫాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం ప్రభాస్ మారుతి డైరెక్షన్‌లో రాజాసాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేల ఎదురుచూస్తున్నారు. ఇలాంటి క్రమంలో సినిమా షూట్ చివరి దశకు వచ్చిందని.. ఏప్రిల్ లో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారని అంతా భావించారు.

The Raja Saab: कल्कि 2898 AD की सफलता के बाद बड़े पर्दे पर नई फिल्म के साथ  जल्द लौटेंगे प्रभास, फिल्म का फर्स्ट लुक हुआ आउट

కానీ రాజాసాబ్‌ సినిమా రిలీజ్‌కు ఆలస్యం అవుతుందని యూనిట్ నుంచి చిన్న లీక్ వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలోనే ఏప్రిల్‌లో సినిమా రాదని క్లారిటీ వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ విషయంపై నిరాశతో ఉన్న ఫ్యాన్స్ కు.. సంక్రాంతి సందర్భంగా మంచి ట్రీట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా సినిమాలోని ఇంట్రెస్టింగ్ లుక్ అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ పిక్ లో డార్లింగ్ కొత్తగా కనిపించిన విధానం అభిమానులను ఆకట్టుకుంటుంది. హారర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో చాలా స్పెషల్ గా.. మైలురాయిగా నిలిచిపోయే అవకాశం ఉందట. ఇక సినిమాలో ప్రభాస్ స‌రసన ముగ్గురు హీరోయిన్స్ కనిపించనున్నారు.

Prabhas radiates vintage vibes in new poster from ‘The Raja Saab’ - www.lokmattimes.com

మాళవిక మోహన్ ప్రధాన పాత్రలో.. నిధి అగర్వాల్, రిద్ది కీలక పాత్రలో మెరమన్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ విల‌న్‌ గా కనిపించనున్నాడు. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాను తెలుగుతోపాటు.. ఇతర భాషల్లోనూ పాన్ ఇండియాలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ తాజా లుక్ నెటింట‌ వైరల్‌గా మారడంతో.. ప్రభాస్ పెళ్లి కొడుకులా కనిపిస్తున్నాడని.. డార్లింగ్ నయాలుక్ అదిరిపోయిందంటూ.. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్‌. రాజాసాబ్‌తో మరోసారి ప్రభాస్ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ సినిమాతో బ్లాక్ బ‌స్టర్ కొడితే.. ప్రభాస్ ఖాతాలో మరోసారి హ్యాట్రిక్ పడుతుంది.