సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన సినిమాలు కలెక్షలపరంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా రిలీజ్ అయిన వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓ రేంజ్ లో కలెక్షన్లు మోత మోగించేస్తుంది. వెంకీ మామ ఆల్రెడీ కలెక్షన్లు సునామీ మొదలు పెట్టేసాడు. వెంకీ హీరోగా.. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన హెలోరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సంక్రాంతి వస్తున్నాం నేడు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
కొద్ది గంటల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా నార్త్ అమెరిక బాక్సాఫీస్ వద్ద సంచలన వాసుళ్ళను కొల్లగొడుతూ రికార్డులు క్రియేట్ చేస్తుంది. సినిమా రిలీజ్ అయిన అతి కొద్ది గంటల్లోనే నార్త్ అమెరికా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 350 కే డాలర్ల వసూళను సాధించి సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని మూవీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు అఫీషియల్ గా పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఇప్పటికే సినిమాకు పాజిటివ్ రివ్యూస్ రావడంతో.. అన్నిచోట్ల భారీ కలెక్షన్లు అందుకుంటుంది.
ప్రతి సంక్రాంతికి ఆనవాయితీ మాదిరిగానే.. ఈసారి కూడా చివరిగా రిలీజ్ అయిన వెంకీ మామ సినిమా కలెక్షన్లతో రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే నెటిజన్లు ఈ సినిమాకి మంచి మార్క్స్ వేశారు. ఈ మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని.. థియేటర్లలో ఎక్స్పీరియన్స్ మరింతగా బాగుంటుందంటూ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. బుల్లి రాజు పాత్రలో వెంకీ ఆకట్టుకుంటున్నాడని చెప్తున్నారు. ప్రత్యేకంగా మ్యూజిక్ మూవీ ని మరింతగా ఎలివేట్ చేసిందని వివరిస్తున్నారు. మరోవైపు డైరెక్టర్ అనిల్ రావిపూడి తన రొటీన్ కామెడీ ట్రాక్ ను ప్రయోగించి సక్సెస్ అయినట్లు టాక్ నడుస్తుంది.