నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి తాజాగా రిలీజ్ అయిన మూవీ డాకు మహారాజ్. యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్లో ఎన్బికె 109 టైటిల్ తో రూపొందిన ఈ సినిమా తాజాగా జనవరి 12న రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజైన ఈ మూవీ ఫస్ట్ డేనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే వరల్డ్ వైడ్‌గా ఓపెనింగ్స్ తోనే ఏకంగా రూ.56 కోట్ల వసూలు రాబట్టింది. ఇక డాకు మహారాజ్ బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచిన రికార్డును క్రియేట్ చేసింది.
అయితే తాజాగా మరో క్రేజీ న్యూస్ అభిమానుల్లో ఫుల్ జోష్ తెచ్చిపెట్టింది. ఇప్పటికే డాకు మహరాజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రూ.6.50 కోట్ల మార్క్ చేరుకుందని.. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల తర్వాత మిలియన్ డాలర్ల మార్క్ చేరుకున్న నాలుగో సినిమాగా నిలిచి.. డాకు రేర్ ఫీట్ తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పటివరకు యూఎస్ లో వరుసగా నాలుగు సినిమాలతో మిలియన్ డాలర్ల మార్క్ సాధించిన వన్ అండ్ ఓన్లీ టాలీవుడ్ హీరోగా బాలయ్య అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక డాకు మహారాజ్ సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ గా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో బాలయ్య బాక్స్ ఆఫీస్ మానియా ఎలా ఉందో వేచి చూడాలి. ఈ సినిమాలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌతెలా స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ప్రగ్యా జైస్వాల్ ఫిమేల్ లీడ్ రోల్‌లో.. శ్రద్ధ శ్రీనాథ్, రోనితా, చాందిని చౌదరి కీలక పాత్రలో కనిపించారు. బాలీవుడ్ యాక్టర్ బాబీ రియల్ స్టైలిష్ విలన్ గా మెప్పించాడు. సినిమా సీతారా ఎంటర్టైన్మెంట్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫర్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, శ్రీ సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీతో బాలయ్య రేర్ అభిమానుల అనందాని రెట్టింపు చేసింది.