టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తారక్ నుంచి ఆరేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న సోలో సినిమా కావడంతో ప్రేక్షకుల్లో సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. సిల్వర్ స్క్రీన్ పై బొమ్మ ఎప్పుడు పడుతుందో చూసేద్దాం అంటూ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ టీజర్ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి మూవీపై వేరే లెవెల్ లో అంచనాలను పెంచేశాయి.
ఈ క్రమంలో మరో ట్రైలర్ మేకర్స్ త్వరలోనే రిలీజ్ చేయనున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు సినిమా సాంగ్స్ పై వచ్చిన టాక్ చెప్పనవసరం లేదు. మొదట ట్రోల్స్ ఎదురైన తర్వాత రికార్డ్ లెవెల్‌లో వ్యూస్ ను సంపాదిస్తూ దూసుకుపోతున్నాయి. మరికొద్ది రోజుల్లో సినిమా నుంచి ఫోర్త్ సింగల్ కూడా రిలీజ్ చేయనున్నారట టీం. అయితే దేవర పార్ట్1 రిలీజ్ కు ముందు ప్రమోషనల్ కంటెంట్ తోనే వరుస రికార్డ్లను క్రియేట్ చేస్తుంది. ఓవర్సీస్ లో గ్రాండ్గా రిలీజ్ కానున్న ఈ సినిమా వేరే లెవెల్లో సంచలనం సృష్టించింది. ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే వన్ మిలియన్ రిసీవ్స్ ను సాధించిన తొలి ఇండియన్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.
అతి త్వరగా వన్ మిలియన్ డాలర్స్ 1.5 మిలియన్ డాలర్స్ ప్రీసెల్ సాధించిన రికార్డ్ కూడా దేవరకే సొంతం అయ్యింది. ఫ్రీ బుకింగ్స్ ఓపెన్ చేసిన అత్యంత తక్కువ సమయంలో ఏకంగా 32 వేల టికెట్లు అమ్ముడుపోవడమే కాదు ఎనిమిది కోట్ల వసూళ్లను రాబట్టి దేవరా మరో రేర్ రికార్డును క్రియేట్ చేసింది. ఇక బ్రిటన్ లోను లిమిటెడ్ బుకింగ్స్ ఓపెన్ కాక ఇప్పటికే 10,000 టికెట్స్ అమ్ముడు పోవడం విశేషం. మరవైపు సెప్టెంబర్ 26న అమెరికాలో ఐకానిక్ ఈజిప్ట్ థియేటర్లో దేవర సినిమాను స్పెషల్ స్క్రీనింగ్ లో ఆడియోస్ తో పాటు ప్రముఖులు వీక్షించనున్నారు. అక్కడ రిలీజ్ కానున్న మొట్టమొదటి ఇండియన్ సినిమా గా కూడా దేవర రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రతిష్టాత్మక సినిమా వేదిక బియాండ్ పెస్ట్ లోను దేవర రెడ్ కార్పెట్ ఈవెంట్ ను జరుపుకుంటుంది. ఇలా దేవర రిలీజ్ కు ముందే రికార్డుల ఊచకోత మొదలైపోయింది. మరీ రిలీజ్ అయిన తర్వాత ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.