దివంగత అతిలోకసుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వికపూర్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే పలు సినిమాలతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. దేవర సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనుంది. అయితే ఈ అమ్మడి నుంచి ఒక్క సినిమా అయినా టాలీవుడ్‌లో రిలీజ్ కాకముందే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది జాన్వి. ఈ క్రమంలో జాన్వీ నటించిన దేవర సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో దేవర ప్రమోషన్స్ లో పాల్గొని సందడి చేస్తుంది జాన్వి. ప్రస్తుతం వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలకు కొదవ ఉండదు. అతి తక్కువ టైంలోనే నేను మంచి పాత్రల్లో నటించి మెప్పించా. అయితే నేను టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణించాలనేది ఆమె కోరిక. అది నిర్వర్తించడానికి సౌత్ సినిమాల కోసం ప్రయత్నిస్తున్న టైం లో నాకు టాలీవుడ్ లో ఆఫర్ దక్కింది. అందులో దేవర ఒకటి.
ఇక అప్పుడే ఒక తమిళ్ సినిమాలోని ఆఫర్ వచ్చింది. ఆ రెండిట్లో ఏది ఓకే చేయాలి అని కన్ఫ్యూజన్‌లో ఉన్నా. అప్పుడు కరణ్ జోహార్ నాకు మంచి సలహా ఇచ్చాడు. ముందైతే తారక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వు. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా మంచి ఆఫర్లు వచ్చేస్తాయి అని అన్నారని.. ఆయన చెప్పినట్లుగానే తారక్ సినిమాలో నటించా.. ఆ సలహా నా కెరీర్‌కు బాగా వర్కౌట్ అయింది. దేవర రిలీజ్ కాకుండానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో ఆఫర్ వచ్చింది. ఇంకా కొన్ని లైన్ లో కూడా ఉన్నాయి. టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జాన్వి చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.