సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోస్ వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా ఈ పై ఫోటోలో కనిపిస్తున్న బుడతడి ఫోటో వైరల్ గా మారింది. ఇతను ప్రస్తుతం ఓ పాన్ ఇండియన్ స్టార్‌హీరో. అమ్మాయిల కలలు రాకుమారుడు. టాలీవుడ్‌లో స్టార్ హీరోగా రాణిస్తున్న ఈ బుడ్డోడు.. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మొదట అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇంతకీ ఈ బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా.. అతను ఎవరో కాదు నేచురల్ స్టార్ నాని.
ఫిబ్రవరి 24, 1984 లో జన్మించిన నాని అసలు పేరు కంద నవీన్ బాబు. కాగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నానిగా పేరును మార్చుకున్నారు. ఒకప్పుడు రేడియో జాకీగా వ్యవహరించిన నాని.. శ్రమ, పట్టులతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పలు సినిమాలకు పని చేశాడు. తర్వాత డైరెక్టర్ మణిరత్నం ప్రేరేపణతో సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆల్ రౌండర్ నాని అనేక సినిమాల్లో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గాను వ్యవహరించాడు.
ఇక 2008లో అష్టాచమ్మా సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇక ఒక్కసారిగా మంచి హిట్ తో నానికి స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసిన మూవీ ఈగ. ఈ సినిమాలో నాని పాత్ర నడివి చాలా తక్కువైనా.. ఉన్నంతలోనే తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత జెంటిల్ మ్యాన్, నేను లోకల్, మిడిల్ క్లాస్ అబ్బాయి, గ్యాంగ్ లీడర్ ఇలా వరుస హిట్లు అందుకుంటూ స్టార్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తర్వాత ప్రతి సినిమాకు డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తూ జెర్సీ, దసరా, హాయ్‌నాన్న రీసెంట్గా సరిపోదా శనివారంతో హిట్లు అందుకున్నాడు. ఇక ఈ సినిమాల్లో దసరా మూవీ పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజై బ్లాక్ బాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.