సినీ ఇండస్ట్రీలో వయసుతో సంబంధం లేకుండా హీరో, హీరోయిన్లు జతకట్టి బ్లాక్ బస్టర్‌లు అందుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అంటే 70 ఏళ్ళ వయసున్న హీరోయిన్లు పాతికేళ్ల వయసున్న హీరోయిన్లతో జతకట్టిన పెద్దగా ఇబ్బంది ఉండట్లేదు. కానీ గతంలో మాత్రం వయసుకు సంబంధించిన చర్చలు ఎప్పుడు జరుగుతూనే ఉండేవి. వయస్సు ప్రస్తావన వస్తూనే ఉండేది. అయితే ఆ కాలంలోనూ ఏజ్‌తో సంబంధం లేకుండా సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. అలా 40 ఏళ్ల ఏజ్ గ్యాప్‌తో బ్లాక్ బస్టర్ పెయిర్ అనిపించుకున్న వారిలో ఎన్టీఆర్, శ్రీదేవి జంట కూడా ఒకటి. ఎన్టీఆర్, శ్రీదేవి మధ్య ఏజ్ క్యాప్ 40 ఏళ్ళు. అ్తే కాదు ఎన్టీఆర్‌కి.. శ్రీదేవి ఓ సినిమాలో మనవరాలుగా నటించింది. 1972లో బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్ తాతగా.. శ్రీదేవి మనవరాలిగా నటించిన మెప్పించారు.
అప్పటికి శ్రీదేవి వయసు కేవలం పదేళ్లు మాత్రమే. సరిగ్గా ఏడేళ్ల తర్వాత శ్రీదేవి.. ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది. అదే వేటగాడు మూవీ. రాఘవేంద్ర డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో రికార్డుల సంచలనం సృష్టించింది. సాంగ్స్ అయితే ఓ ఊపు ఊపేసాయి. ఇక ఈ సినిమా హైయెస్ట్ కలెక్షన్లతో ప్రొడ్యూసర్లకు కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాలో వచ్చే ఆకు చాటు పిండి తడిచే సాంగ్ ఇప్పటికీ ఎంతోమంది వింటూనే ఉంటారు. అయితే ఈ సినిమాకి ముందు మనవరాలిగా నటించిన అమ్మాయి.. హీరోయిన్గా నటించడమేంటి అంటూ ఎన్నో కామెంట్లు వ్యక్తం అయ్యాయి. తాతగా నటించిన ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా శ్రీదేవి నా అంటూ విమర్శలు కూడా ఎదురయ్యాయి. అయితే శ్రీదేవిని.. ఎన్టీఆర్ జంటగా నటింపజేయాలని ఆలోచన మొదట డైరెక్టర్ కెరాఘవేంద్రరావుదట. అప్పటికే రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో శ్రీదేవి పదహారేళ్ళ వయసు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో రాఘవేంద్రం మరోసారి శ్రీదేవినే వేటగాడు సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు.
ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి స్వయంగా వివరించింది. రాఘవేంద్రరావు గారు నా దగ్గరకు వచ్చి నీకు ఒక పెద్ద షాకింగ్ న్యూస్ చెప్పబోతున్న అన్నారని.. నువ్వు, నేను మళ్ళీ కలిసి పని చేయబోతున్నామని వివరించారని.. ఇది షాకింగ్ న్యూస్ ఎలా అవ్వబోతుంది.. చాలా మంచి విషయం కదా అని నేను అన్నాను అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈసారి నువ్వు చాలా పెద్ద హీరోలతో చేయబోతున్నావు అని ఆయన అన్నారని.. ఎవరు ఆ హీరో అంటే ఎన్టీఆర్ గారు అని చెప్పారని నిజంగానే ఆశ్చర్యపోయా.. ఏంటి సార్ నేను ఆయనతో ఆల్రెడీ మనవరాలుగా నటించా.. ఇప్పుడు హీరోయిన్గా ఎలా నటించమంటారని ప్రశ్నించానని.. ఏం కాదు అదంతా నేను చూసుకుంటా అని రాఘవేంద్రరావు గారు మాటిచ్చారు అంటూ శ్రీదేవి వెల్లడించింది. ఎన్టీఆర్ కూడా మనవరాలిగా నటించిన శ్రీదేవి హీరోయిన్ ఏంటి.. వద్దు అని చెప్పారట. అయితే రాఘవేంద్రరావు మీ కాంబినేషన్లో బాగుంటుంది. దయచేసి సినిమాలో నటించమని కన్విన్స్ చేశాడట. అలా ఎన్టీఆర్, శ్రీదేవి వేటగాడు సినిమాలో నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు.