టాలీవుడ్ స్టార్ ప్రభాస్ పేరు చెప్పగానే మొదట గుర్తుకు వచ్చేది బాహుబలి, సలార్ సినిమాలే. అయితే ఈ సినిమాల కంటే ముందు ప్రభాస్ మాస్ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెంచిన మూవీ చత్రపతి. సింహాద్రి రేంజ్‌లో జక్కన్న కమర్షియల్ విశ్వరూపం సినిమాతో బయటపెట్టారు. ఇక ఛత్రపతి సినిమా ప్రస్తావన వచ్చినప్పుడల్లా హైలెట్‌గా నిలిచేది ఇంటర్వెల్ సీన్. బాజీరావును చంపి సవాన్ని ఈడ్చుకుంటూ వెళ్లి ఒక్క అడుగు అంటూ కోట శ్రీనివాస్ కి ప్రభాస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చే సీనివేశాలు అప్పట్లో థియేటర్లను షేక్ చేసి పడేసాయి. ఒక్క పది నిమిషాలు ఎపిసోడ్‌తో రిపీటెడ్‌గా ఆడియన్స్‌ను తీసుకురావచని రాజమౌళి ప్రూవ్ చేశాడు.
దీనికి సంబంధించిన ఓ ముఖ్యమైన రహస్యాన్ని ప్రభాస్ తాజాగా రివీల్ చేశాడు. ప్రభాస్ మాట్లాడుతూ.. కోటకు వార్నింగ్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత వందలాది మంది జనం మధ్యలో గొడుగు కింద పెద్ద డైలాగ్ చెప్పే సీను ఉంటుందని.. నిజానికి అక్కడ తను అరుస్తూ సంభాషణ చెప్పలేదు అంటూ వివరించాడు. అంత గట్టిగా అరవలెను.. సైలెంట్ గా చెప్తానని రాజమౌళితో అన్నానని.. ఆయన ఓకే అనేసారంటూ చెప్పుకొచ్చాడు. షార్ట్ అలానే ఓకే చేసేసారని.. డబ్బింగ్ లో ఫైర్ వినిపించేలా క్రియేట్ చేశారని.. ఇదే విధానాన్ని చాలాకాలం కొనసాగించానంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. ఇక మిస్టర్ పర్ఫెక్ట్ షూటింగ్ టైంలో కే.విశ్వనాధ్ గారు దీనిని గమనించి నన్ను దగ్గరకు పిలిచి ఆర్టిసి సిగ్గుపడకూడదు.. ఓపెన్ గా డైలాగులు చెప్పమంటూ సలహాలు ఇచ్చారని వెల్లడించాడు.
అయితే నాకు మొదటినుంచి అలా అలవాటు అవడానికి చత్రపతి లో అలా చేయడమే కారణమని.. దానికి ఇతర దర్శకులు, రాజమౌళి నే బాధ్యులు అంటూ సరదాగా వివరించాడు. ఇక ప్రభాస్ ఈ సినిమా తర్వాత బాహుబలి నుంచి తన రియల్ పెర్ఫార్మెన్స్‌ను ఇంప్రూవ్ చేసుకుంటూ మార్కెట్, ఇమేజ్ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లాడు. ఇక ప్రభాస్ నుంచి చివరికి వచ్చిన సలార్, కల్కి 2898 ఏడి రెండు వరుస విజయాలను అందుకోవడంతో.. మంచి ఫామ్ లో ఉన్న ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్, ఫౌజీ సినిమాలతో బిజీగా గడుతున్నాడు. ఇవి పూర్తయిన వెంటనే స్పిరిట్ సినిమాను మొదలు పెట్టానున్నాడు. కల్కి 2, సలార్‌కి మరి కొంత టైం పట్టేలా ఉందని టాక్. ఇక తను హీరోగా నటించిన ఈ అన్ని సినిమాల కంటే ముందు.. క్యామియో పాత్రలో నటించిన కన్నప్పతో ఆడియన్స్ ముందుకు వస్తాడు.