నంద‌మూరి – మెగా ఫ్యాన్స్ మ‌ధ్య ఆ సినిమా చిచ్చు పెట్టిందా…!

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ బిగ్గెస్ట్ పాపులర్ ఫ్యామిలీస్ లో నందమూరి కుటుంబం ఒకటి. టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేక హోదా ఉంది. అయితే ఇప్పటికే ఎంతోమంది నందమూరి కుటుంబం నుంచి హీరోలుగా ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా నందమూరి బ్యాక్ డ్రాప్ తో నితిన్ నార్నే ఎంట్రీ ఇచ్చారు. తాజాగా నితిన్ చేసిన ఆయ్‌ మూవీ లోని కులాల కొట్లాటల ఎపిసోడ్.. నెటింట‌ వివాదంగా మారింది. చిరు, బాలయ్య రిఫరెన్స్ సీన్లు ఇరు అభిమానుల మధ్య సోషల్ మీడియాలో గొడవలకు కారణమయ్యాయి. ఎన్టీఆర్ బామ్మర్ది.. నీతిన్‌ నటించిన ఆయ్ సినిమాలోని ఓ సీన్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

Aay enters profit zone: The Narne Nithin film outshines Double Ismart and  Mr. Bachchan

ఒక కుటుంబం నుంచి వచ్చిన సీనియ‌ర్ హీరోల రిఫ‌రిన్స్‌ల‌తో వారి కుటుంబంలోని యంగ్ హీరోలు ఎంట్రీ ఇచ్చి కెరీర్ ను బూస్టప్‌ చేసుకునే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ క్ర‌మంలో నార్నే నితిన్ నుంచి వ‌చ్చిన ఆయ్ సినిమాలో బాలయ్య, చిరంజీవి ఫ్యాన్స్ మధ్య గొడవలు ఉన్నాయని విధంగా స్టోరీని రాశారు. అలా ఎన్టీఆర్ కూడా తన కెరీర్ స్టార్టింగ్ లో సీనియర్ ఎన్టీఆర్, బాలయ్య రిఫరెన్స్‌లతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వాడే. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కుటుంబం నుంచే వచ్చిన ఈ యంగ్ హీరో ఆయ్‌ సినిమాలో బాలయ్య పై ఘోరమైన అవమానం జరిగేలా సన్నివేశాల‌లో న‌టించ‌డం.. వాటిపై ఎలాంటి అభ్యంతరం రాక‌పోవ‌డం ఇప్పుడు సందేహంగా మారింది.

AAY Release Date Promo | Narne Nithiin, Nayan Sarika | In Cinemas  #AAYOnAug15 - YouTube

ఇక తాజాగా ఆయ్ ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో విలన్ బాలయ్య అభిమానిగా ఉంటాడు. అతనికి ఎదురు తిరిగిన వారందరినీ చితకబాధడమే లక్ష్యంగా వెళుతూ ఉంటాడు. ఇక అలాంటి వాడినే చితక్కొట్టే పాత్రధారుడిగా మెగాస్టార్ అభిమాని ఉంటాడు. బాలయ్య, చిరు ఇద్దరి హోల్డింగ్స్ కూడా వెనుక కనిపిస్తూ ఉంటాయి. ఇలా బాలయ్య అభిమానిని విల‌న్‌ చేసి అతని కుక్కని కొట్టినట్లు చూపించడం మెగాస్టార్‌ను ఎలివేట్ చేసినట్లుగా అనిపించింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోకి రావడం మెగా అభిమానులు కూడా మెగాస్టార్ ను ఎన్టీఆర్ బామ్మర్ది ఈ రేంజ్ లో ఎలివేట్ చేశారా..? బాలయ్య పై ఇలాంటి సీన్స్ తీసారా.. అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ మాస్ స‌న్నివేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.