హీరోయిన్ రెజీనా కసాండ్రా ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత మెల్లమెల్లగా టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ఈ అమ్మడు గురించి గతంలో ఎన్నో ఎఫైర్ వార్తలు నెటింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇక రెజినా మనసులో ఏది ఉన్నా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం. ఏదైనా డైరెక్ట్ గా మాట్లాడేస్తుంది. అది తన వ్యక్తిగత విషయమైనా ఆమె అలాగే రియాక్ట్ అవుతుంది. తాజాగా తన లైఫ్ లో రిలేషన్‌షిప్స్‌పై ఆమె రియాక్ట్ అవుతూ.. అవును చాలామందితో డేటింగ్ చేశాను అంటూ వివరించింది.
చాలా ప్రొపోజల్స్ వచ్చాయని.. కొన్ని కనెక్ట్ కూడా అయ్యాయి. నా జీవితంలో చాలా రిలేషన్‌షిప్‌లు ఉన్నాయంటూ వివరించింది. ఇక తనని తాను ఓ సీరియల్ డేటా అని చెప్పుకుంది. ఒకప్పుడు చాలా డేటింగ్స్ చేశానని.. ప్రస్తుతం ఎలాంటి డేటింగ్స్ లేవు.. బ్రేక్ తీసుకున్న అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఎప్పుడు ఇంత ముక్కుసూటితనంగా మాట్లాడడం కూడా తన మాజీ ప్రియులకు ఇబ్బంది అనిపించిందని.. ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ తల్లిదండ్రులు.. చాలామంది నా వ్యాఖ్యలు అసలు నచ్చలేదంటూ వివరించింది.
అయితే ఎవరి కోసమో నా వైఖరి మార్చుకోలేదంటూ చెప్పుకొచ్చింది రెజీనా. నా లైఫ్ లో వచ్చే అబ్బాయి చాలా బాధ్యతగా ఉండాలి.. నన్ను కేరింగ్‌గా చూసుకోవాలంటూ వివరించింది. నేను చాలా ఫ్రీడమ్ గా ఉంటాను.. ఎవరైనా ఏదైనా చేయమంటే.. ఎందుకు చేయాలి.. ఎలా చేయాలి.. అని ప్రశ్నిస్తా. నా ప్రశ్నలన్నిటికీ ఓపిక సమాధానం చెప్పే వ్యక్తి ఉండాలి అంటూ చెప్పుకొచ్చింది. గతంలో అబ్బాయిల్ని నూడిల్స్ తో పోలుస్తూ కామెంట్ చేసింది. దాని అర్థం అబ్బాయిలతో వ్యవహారం నూడిల్స్‌లా రెండు నిమిషాల్లో ముగుస్తుందని కాబోలు. ఇప్పుడు ఇదే విషయాన్ని క్లారిఫై చేస్తూ తన లైఫ్ లో ఎన్నో రిలేషన్ షిప్స్ ఉన్నాయి అంటూ రివీల్ చేసింది.