మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. కొరటాల శివకాంబోలో దేవర తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక సినిమా రిలీజ్ కేవలం రెండు వారాలు గ్యాప్ మాత్రమే ఉండడంతో.. సినిమా ప్రమోషన్స్ లోనూ స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ కోసం ఆయనను ఎంతగానో అభిమానించే ఇద్దరు యంగ్ హీరోలు రంగంలోకి దిగారు. తమ ఫేవరెట్ హీరోతో చిట్‌చాట్ చేస్తూ.. సినిమాపై మరింత హైప్‌ను పెంచేందుకు.. ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యారు.
ఇక తాజాగా సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రిలీజ్ అయిన 24 గంటల్లోనే అన్ని భాషల్లో 55 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించుకున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. దీంతోపాటు.. యూట్యూబ్‌లో టాప్ ట్రేడింగ్‌గా ట్రైలర్ నిలిచింది. ఇక ఈ ట్రైలర్‌తో దేవర ఆల్ టైం రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ట్రైలర్ ఇన్ని వ్యూస్ రావడం ఇదే మొదటిసారి అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే దేవర ప్రమోషన్స్ కోసం తాజాగా యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ రంగంలోకి దిగారు. తారక్‌తో చిట్‌చాట్ చేశారు. ఈ చిట్‌చాట్‌లో ఎన్టీఆర్‌తో పాటు.. కొరటాల శివ పాల్గొని సందడి చేశాడు. ఈ వీడియోను నేడు యూట్యూబ్లో రిలీజ్ చేసే అవకాశం ఉందని టాక్.
ఇక ఈ చిట్‌చాట్ కోసం ఇద్దరు హీరోలు గట్టిగానే ప్రిపేర్ అయ్యారని.. ఎన్టీఆర్ నుంచి రాబట్టలేని కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ ఇద్దరు రాబట్టే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తుంది. ఇంటర్వ్యూ మొత్తం చాలా ఫన్నీగా సాగిందని.. ఇంటర్వ్యూలో సిద్దు , విశ్వక్‌లు పోటీపడి మరి ఎన్టీఆర్‌ను ఇరుకున్న పెట్టే విధంగా ప్రశ్నలు స్పందించారని.. వాటికి ఎన్టీఆర్ తనదైన స్టైల్‌లో తెలివిగా రియాక్ట్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమానులంతా ఈ చిట్‌చాట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విశ్వక్, సిద్దు పక్కా నందమూరి ఫ్యాన్స్ అన్న సంగతి అందరికీ తెలుసు. వీళ్ళిద్దరూ నటించిన పలు సినిమాలకు కూడా ఎన్టీఆర్, బాలయ్య ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఇక విజయవాడ వరద బాధితులకు సహాయం అందించేందుకు స్వయంగా బాలకృష్ణతో ఈ ఇద్దరు యంగ్ హీరోలు వెళ్లి సీఎం చంద్రబాబును కలిసి చెక్ అందజేశారు.