ఒకప్పటి స్టార్ హీరోయిన్ కుష్బూ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస అవకాశాలను దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. ఓ వైపు సినిమాలో నటిస్తూనే.. మరోవైపు పలు టీవీ షోలలో జడ్జ్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఓ చిట్‌చాట్‌లో పాల్గొన్న కుష్బూ ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ఇందులో భాగంగా తన పేరును ఎప్పుడు మార్చుకుందా.. టాలీవుడ్ ఫేవరెట్ హీరో ఎవరు.. ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ప్రస్తుతం దానికి సంబంధించిన న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది.
స్టార్ బ్యూటీ కుష్బూ అసలు పేరు నఖత్ ఖాన్. అయితే తన ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత కుష్బూగా పేరును మార్చుకుందుట. రెండిటికి అర్థం ఒకటేనని.. బాలనట్టిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన టైంలో నకాత్ పేరు కుష్బూగా మార్చుకున్నట్లు వివరించింది. ఇక కుష్బూ గుడి, కుష్బు ఇడ్లీ, కుష్బు దోశ .. వీటిపై మీ అభిప్రాయం ఏంటి అని అడగగా… అభిమానులు గుడి కట్టిన టైంలో నాకు నాలుగు షిఫ్ట్ లో పని ఉంది. ఈ క్రమంలో ప్రచారానికి దూరంగా ఉన్న. అప్పుడు నాకు తమిళ్ కూడా చదవడం రాదు. తర్వాత రియాక్ట్ అవ్వాలంటే అప్పటికి ఆలస్యమైందని వదిలేసా.. అంటూ చెప్పుకొచ్చింది.
ఇక వెంకటేష్, నాగార్జున లో ఎవరు ఫేవరెట్ హీరో అని అడగగా వెంకటేష్ అని సమాధానం ఇచ్చింది. వెంకటేష్, కమలహాసన్, మోహన్‌బాబు లో.. కమల్ హాసన్ అంటూ ఆమె వివరించింది. చిరంజీవి, కమలహాసన్‌లో ఎవరంటే ఎక్కువ ఇష్టమని అడగగా ఒకరినే సెలెక్ట్ చేసుకోవడం కష్టం అంటూ చెప్పిన కుష్బూ.. పవన్, మహేష్ బాబు ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ వస్తే ఎవరికి డేట్ ఇస్తారు అని అడగగా.. ఇంట్రస్టింగ్ సమాధినం చెప్పింది. ఏ సినిమాలో నా రోల్ బాగుండి.. రెమ్యూనరేషన్ ఎక్కువగా అనిపిస్తే.. అందులోనే చేస్తా అంటూ చెప్పుకొచ్చింది. ఇలా ఇంకా ఎన్నో ప్రశ్నలకు తన తెలివితేటలతో ఆసక్తికర సమాధానాలను చెప్పి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలో కుష్బూ చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.